Illegal Drug Export to Pakistan: పాక్‌కు ట్రమడోల్ డ్రగ్స్.. లుసెంట్‌పై ఈడీ చార్జిషీట్
ABN, Publish Date - Aug 12 , 2025 | 05:19 AM
పాకిస్థాన్, మరికొన్ని దేశాలకు ఎలాంటి అనుమతి లేకుండా ట్రమడోల్ మత్తుమందును ఎగుమతి చేసిన కేసులో.. లుసెంట్
పాకిస్థాన్, మరికొన్ని దేశాలకు ఎలాంటి అనుమతి లేకుండా ట్రమడోల్ మత్తుమందును ఎగుమతి చేసిన కేసులో.. లుసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా చిరునామాతో లుసెంట్ కంపెనీ ఆయా దేశాలకు మత్తుమందును ఎగుమతి చేసింది. గతంలో ఈ సంస్థకు బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనుమతులుండేవి. నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్‌కు ఎగుమతి చేయడంతో.. ఆ అనుమతులను రద్దు చేశారు. అయినా.. పాకిస్థాన్, మరికొన్ని దేశాలకు ఎగుమతులను కొనసాగించడంతో.. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఫిబ్రవరిలో లుసెంట్‌కు చెందిన రూ.5.67 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
Updated Date - Aug 12 , 2025 | 05:19 AM