ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Election Commission: అప్పుడే చెప్తే తప్పులు దిద్దేవాళ్లం!

ABN, Publish Date - Aug 17 , 2025 | 05:43 AM

బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలన్నీ నిప్పులు చెరుగుతూ, జాబితాలో ఉన్న తప్పులపై ప్రశ్నిస్తుండడంపై ఈసీ స్పందించింది.

  • కొన్ని పార్టీలు ఓటర్‌ జాబితాలను సరైన సమయంలో పరిశీలించనట్టుంది: ఈసీ

న్యూఢిల్లీ, ఆగస్టు 16: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలన్నీ నిప్పులు చెరుగుతూ, జాబితాలో ఉన్న తప్పులపై ప్రశ్నిస్తుండడంపై ఈసీ స్పందించింది. ‘‘ఇటీవలికాలంలో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు ఓటర్ల జాబితాలో తప్పుల గురించి చెబుతున్నారు. గత జాబితాల్లో తప్పుల గురించి కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే.. ఆయా రాజకీయ పార్టీలు, ఆ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్లు.. ఓటర్ల జాబితాలను సరైన సమయంలో పరిశీలించి, తప్పులను గుర్తించి సంబంధిత ఎన్నికల అధికారులతో పంచుకోనట్టు కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది.

ఓటరు జాబితాలో ఓటర్ల చేరికలు, తీసివేతలకు సంబంధించిన ప్రక్రియను గురించి పది పాయింట్లతో శనివారం ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేసిన ఈసీ.. ముసాయిదా జాబితాలను, ఖరారైన తర్వాత ఆ జాబితాలను కూడా అన్ని రాజకీయ పార్టీలకూ పంపుతామని.. వాటిలో ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీలు ఆ జాబితాలను పరిశీలించి, అప్పుడేచెప్పాలని గుర్తుచేసింది. ఇప్పుడు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అప్పుడే (సరైన సమయంలో), సరైన పద్ధతిలో లేవనెత్తి ఉంటే సంబంధిత అధికారులు అప్పట్లోనే ఆ తప్పులను (అవి నిజమైన తప్పులే అయి ఉంటే) దిద్ది ఉండేవారని పేర్కొంది. రాజకీయ పార్టీలు లేదా ఓటర్లు ఓటర్ల జాబితాను ఎప్పుడు పరిశీలిస్తామన్నా తాము స్వాగతిస్తామని ఈసీ స్పష్టం చేసింది. దీనివల్ల తప్పులను తొలగించడం సులువవుతుందని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:43 AM