Ajit Doval: యుద్ధం మా అభిమతం కాదు
ABN, Publish Date - May 11 , 2025 | 04:31 AM
యుద్ధం తమ అభిమతం కాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ) అజిత్ డోభాల్ అన్నారు.
చైనాకు స్పష్టం చేసిన డోభాల్
న్యూఢిల్లీ, మే 10: యుద్ధం తమ అభిమతం కాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ) అజిత్ డోభాల్ అన్నారు. శనివారం పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ తర్వాత వాంగ్ యీతో డోభాల్ ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని గురించి ఆయనకు వివరించి, 26 మంది ఆ ఘటనలో మృతిచెందినట్లు వివరించారు.
‘‘ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయి. అయితే.. ఒప్పందం జరిగిన నాలుగు గంటల్లోనే పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది’’ అని డోభాల్ వివరించారు. దీనికి వాంగ్ యీ స్పందిస్తూ.. పహల్గాం దాడిని చైనా తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Updated Date - May 11 , 2025 | 04:31 AM