MP Kanimozhi: కనిమొళి బృందానికి రష్యాలో తప్పిన ముప్పు
ABN, Publish Date - May 24 , 2025 | 05:25 AM
పాకిస్థాన్ వ్యవహార శైలిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా రష్యాకు వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ఎంపీల బృందానికి పెద్ద ముప్పు తప్పింది.
మాస్కో/చెన్నై, మే 23: పాకిస్థాన్ వ్యవహార శైలిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా రష్యాకు వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ఎంపీల బృందానికి పెద్ద ముప్పు తప్పింది. వీరు ప్రయాణించిన విమానం గురువారం రష్యా రాజధాని మాస్కోలోని విమానాశ్రయంలో నిర్దేశిత సమయంలో దిగకుండా కొంత సమయంపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది.
రష్యాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్..గురువారం రాత్రి మాస్కోపై డ్రోన్ దాడులతో విరుచుకు పడడమే ఇందుకు కారణం. డజన్ల కొద్దీ ఉక్రెయిన్ డ్రోన్లు మాస్కోను లక్ష్యంగా చేసుకోవడంతో.. అధికారులు అక్కడి విమానాశ్రయాలను కొంత సమయంపాటు మూసివేశారు. దీంతో, 45 నిమిషాలు ఆలస్యంగా దొమొదెదోవో విమానాశ్రయంలో వీరి విమానం సురక్షితంగా లాండ్ అయినట్లు కనిమొళి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Updated Date - May 24 , 2025 | 05:25 AM