DGP: సోషల్ మీడియాలో యూనిఫాంతో భేటీలు, ఫొటోలు వద్దు
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:27 AM
రాష్ట్ర పోలీసుశాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కార్యాలయాలకు సంబంధించిన వ్యవహారాల గురించి, కీలకమైన దర్యాప్తు వివరాలు తెలిపే ప్రకటనలలో యూనిఫాంతో ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేయకూడదని, అదే విధంగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని డీజీపీ శంకర్‌జివాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశం
చెన్నై: రాష్ట్ర పోలీసుశాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కార్యాలయాలకు సంబంధించిన వ్యవహారాల గురించి, కీలకమైన దర్యాప్తు వివరాలు తెలిపే ప్రకటనలలో యూనిఫాంతో ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేయకూడదని, అదే విధంగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని డీజీపీ శంకర్‌జివాల్(DGP Shankarjival) ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవలి కాలంలో ప్రైవేటు కార్యక్రమాలకు యూనిఫాంతో వెళ్లే పోలీసు ఉన్నతాధికారులు తమ జోన్ పరిధిలో వివిధ కేసులపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను ప్రకటిస్తున్నారని తమకు పలు వర్గాల నుండి ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. యూట్యూట్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ కేసుల దర్యాప్తునకు సంబంధించి కీలకమైన వివరాలను కూడా వెల్లడిస్తున్నట్లు తనకు తెలియవచ్చిందన్నారు.
ఇకపై పోలీసు ఉన్నతాధికారులు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వదలిస్తే ప్రభుత్వ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని కూడా శంకర్‌జివాల్ తెలిపారు. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులు తాము పాల్గొనబోయే కార్యక్రమాల వివరాలు, ఆ కార్యక్రమాలలో తాము ప్రసంగించదలచిన వివరాలు ఉన్నతాధికారులకు ముందుగా తెలిపితే మరీ మంచిదన్నారు. ఇకపై సోషల్ మీడియాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ యూనిఫామ్‌తో ఉన్న ఫొటోలు పంపకూడదని, పై అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ఇంటర్వ్యూలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 07 , 2025 | 11:28 AM