DGHS: కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మెడికల్ రిప్రజెంటేటివ్‌ల ప్రవేశంపై నిషేధం
ABN, Publish Date - Jun 04 , 2025 | 05:43 AM
కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌లను వైద్యులతో నేరుగా సమావేశమవ్వడాన్ని డీజీహెచ్‌ఎస్ నిషేధించింది. ఫార్మా సమాచారాన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా పంచుకోవాలని, నియమాలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశించింది.
న్యూఢిల్లీ, జూన్ 3: మెడికల్ రిప్రజెంటేటివ్‌లు కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులతో సమావేశం కావడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసె్‌స(డీజీహెచ్‌ఎస్) నిషేధం విధించింది. ఈ మేరకు మే 28న ఆయా ఆస్పత్రుల ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధునిక వైద్య విధానాలు, ఔషధాలకు సంబంధించిన సమాచారాన్ని వైద్యులతో పంచుకునేందుకు మెడికల్ రిప్రజెంటేటివ్‌లు ఈ-మెయిల్, మరేదైనా డిజిటల్ మీడియాను వినియోగించాలని డీజీహెచ్‌ఎస్ సూచించింది. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం ఫార్మా సంస్థలకు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్‌లు ఇష్టారీతిన వైద్యులతో సమావేశం అవుతున్నారు. ఫలితంగా రోగులకు అందే వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. నిజానికి, కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మెడికల్ రిప్రజెంటేటివ్‌ల ప్రవేశంపై నిషేధం విధిస్తూ డీజీహెచ్‌ఎస్ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 05:43 AM