ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DGCA: ఆ ముగ్గురు అధికారులను తొలగించండి

ABN, Publish Date - Jun 22 , 2025 | 05:59 AM

విమానయాన భద్రతా ప్రొటోకాల్‌ను తీవ్రంగా ఉల్లంఘించిన ఎయిరిండియాలోని ముగ్గురు సీనియర్‌ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.

  • ఎయిరిండియాను ఆదేశించిన డీజీసీఏ

న్యూఢిల్లీ, జూన్‌ 21: విమానయాన భద్రతా ప్రొటోకాల్‌ను తీవ్రంగా ఉల్లంఘించిన ఎయిరిండియాలోని ముగ్గురు సీనియర్‌ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది. సిబ్బంది షెడ్యూలింగ్‌, రోస్టర్‌కు సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి తొలగించడంతో పాటు వారిపై వెంటనే అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించి పది రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని పేర్కొంది.

తదుపరి నోటీసులు ఇచ్చేవరకూ చూరా సింగ్‌ (డివిజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), పింకీ మిట్టల్‌ (చీఫ్‌ మేనేజర్‌- డీవోపీఎస్‌, క్రూ షెడ్యూలింగ్‌), పాయల్‌ ఆరోరా (క్రూ షెడ్యూలింగ్‌, ప్లానింగ్‌)ను నాన్‌-ఆపరేషనల్‌ విధులకు పరిమితం చేయాలని సూచించింది. తమ ఆదేశాల అమలులో విఫలమైతే తీవ్రమైన చర్యలు ఉంటాయని, విమానయాన సంస్థ తన నిర్వహణ అనుమతులు కోల్పోయే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. సిబ్బంది షెడ్యూలింగ్‌, పైలట్ల లైనె్‌స్సలు, వారికి విశ్రాంతి వంటి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను వీరు పలుమార్లు ఉల్లంఘించారని పేర్కొంది.

Updated Date - Jun 22 , 2025 | 06:01 AM