ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Airport: 114 రోజువారీ విమానాలు 3 నెలలపాటు రద్దు

ABN, Publish Date - Jun 06 , 2025 | 09:49 PM

ప్రయాణికులకు పెద్దగా అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి కొన్ని విమాన సర్వీసులను మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డీఐఏఎల్ సీఈవో కుమార్ జైపురియార్ తెలిపారు. ప్రతిరోజూ 1,450 విమాన సర్వీసులు నడున్నాయని, వీటిలో 114 ఆపరేషన్లను రద్దు చేస్తున్నామని చెప్పారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) శుక్రవారం నాడు కీలక ప్రకటన చేసింది. 114 రోజువారీ విమానాలను మూడు నెలలపాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 15వ తేదీ నుంచి దీనిని అమలు చేయనున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 15 వరకూ ఇది అమల్లో ఉంటుంది. విమానాశ్రయంలోని కీలక రన్‌వేలలో ఒక రన్‌వే‌పై అప్‌గ్రేడేషన్‌ పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దీంతో రోజువారీ నడుస్తున్న మొత్తం విమాన సర్వీసుల్లో 7.5 శాతం విమాన సర్వీసులు తగ్గనున్నాయి.


ప్రయాణికులకు పెద్దగా అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి కొన్ని విమాన సర్వీసులను మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డీఐఏఎల్ సీఈవో కుమార్ జైపురియార్ తెలిపారు. ప్రతిరోజూ 1,450 విమాన సర్వీసులు నడుస్తున్నాయని, వీటిలో 114 ఆపరేషన్లను రద్దు చేస్తున్నామని, మరో 86 విమానాలను రద్దీ లేని గంటల్లో రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ముందుగానే సమాచారం ఇస్తామన్నారు.


ఐజీఐఏలో ప్రస్తుతం నాలుగు రన్‌వేలు నడుస్తున్నాయి. వీటిలో ఆర్‌డబ్ల్యూ 09/27, ఆర్‌డబ్ల్యూ 11R/29L, ఆర్‌డబ్ల్యూ 11L/29R, ఆర్‌డబ్ల్యూ 10/28 ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూ 10/28 రన్‌వేపై తొలుత అప్‌గ్రేడేషన్ పనులు ఏప్రిల్ 8న ప్రారంభించినప్పటికీ అనుకోని వాతావరణ పరిస్థితులతో వాటికి అంతరాయం కలిగింది. దీంతో రన్‌వే ఆపరేషన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా మరోసారి రన్ వే పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూ 10/28 సేవలకు కొన్ని రోజులు అంతరాయం కలిగినప్పటికీ సెప్టెంబర్ 15 కల్లా తిరిగి అందుబాటులోకి వస్తాయి.


ఇవి కూడా చదవండి..

చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు..

For More National News and Telugu News..

Updated Date - Jun 06 , 2025 | 10:02 PM