ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. తేల్చేసిన రాజ్‌నాథ్ సింగ్

ABN, Publish Date - May 16 , 2025 | 01:44 PM

Operation Sindoor: పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్‌పై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని అన్నారు.

Operation Sindoor

న్యూఢిల్లీ, మే 16: దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని అన్నారు. శుక్రవారం భుజ్ ఏయిర్‌బేస్‌లో రాజ్‌నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ అధికారులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఆపరేషన్ సిందూర్ ముగియలేదు. ఇప్పటి వరకు చూసిందంతా ట్రైలర్ మాత్రమే.


సరైన సమయం వచ్చినపుడు ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తాం. పాకిస్తాన్‌ను ఇప్పుడు ప్రొబేషన్ పీరియడ్‌లో పెట్టాము. పాక్ తన బుద్ధి మార్చుకుంటే పర్లేదు. లేకపోతే కఠినమైన శిక్షలు వేస్తాం’ అని అన్నారు. ఏయిర్‌ఫోర్స్ అధికారులకు కృతజ్ణతలు తెలిపారు. ఏయిర్‌ఫోర్స్ అధికారుల పని తీరును పొగడటానికి తనకు మాటలు సరిపోవటం లేదన్నారు. యావత్ దేశం తరపునుంచి మరోసారి ఏయిర్‌ఫోర్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్‌నాథ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘ పాకిస్తాన్ గడ్డమీద ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను మీరు ఎలా ధ్వంసం చేశారో ప్రపంచం మొత్తం చూసింది.


తర్వాత కూడా వారి ఏయిర్‌బేస్‌లను ధ్వంసం చేశారు. భారత్ యుద్ధ నియమాలు, టెక్నాలజీ మారిందని ప్రపంచానికి మీరు చాటి చెప్పారు. ధైర్య, సాహసాలకు ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ ప్రతీకగా నిలిచింది. ఏయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌కు నా కృతజ్ణతలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. నిన్న జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణు బాంబులను లాక్కోవాలని ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి విజ్ణప్తి చేశారు.


ఇవి కూడా చదవండి

Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు

Dipika Kakar: పాపం నటికి ఎంత కష్టం వచ్చింది.. కాలేయంలో టెన్నిస్ బాల్ సైజు ట్యూమర్

Updated Date - May 16 , 2025 | 02:17 PM