COVID 19: దేశవ్యాప్తంగా వెయ్యి దాటిన కరోనా కేసులు
ABN, Publish Date - May 27 , 2025 | 05:16 AM
దేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్రమంత్రి ప్రకారం, గత వారం దేశవ్యాప్తంగా 1,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా NB.1.8.1, LF.7 వేరియంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మే 26: దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గతవారం 99 కేసులతోపాటు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. దేశవ్యాప్తంగా గత వారం 752 కొత్త కేసులతోపాటు మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 1,009 దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహమ్మారి బారిన పడ్డ పడిన మరణించిన వారి సంఖ్య ఏడుగురికి చేరుకున్నది. ఇక కొవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన వారిలో 354 మంది డిశ్చార్జయ్యారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఎన్‌బి.1.8.1, ఎల్‌ఎఫ్.7 వేరియంట్‌వే అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఐఎన్‌ఎ్‌సఏసీవోజీ) తెలిపింది. ఎన్‌బి.1.8.1, ఎల్‌ఎఫ్.7 వేరియంట్లు అంత ప్రమాదకరం కాదని డబ్లూహెచ్‌వో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 05:16 AM