ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Waqf Amendment Act: నువ్వు ఎన్నికల కమిషనర్‌ కాదు ముస్లిం కమిషనర్‌వి

ABN, Publish Date - Apr 21 , 2025 | 04:10 AM

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలియంది. ఆ వ్యాఖ్యలు, భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషీపై చేసిన ఆరోపణలతో, రాజకీయ ముదలంగా మారాయి.

మాజీ సీఈసీ ఖురేషీపై బీజేపీ ఎంపీ దూబే విమర్శలు

ముస్లింల భూములు లాక్కొనేందుకే

వక్ఫ్‌ చట్ట సవరణ అంటూ ఖురేషీ వ్యాఖ్యలు

సుప్రీంకోర్టుపై నిశికాంత్‌ దూబే వ్యాఖ్యలు వ్యక్తిగతం

వాటితో బీజేపీకి సంబంధం లేదు: పార్టీ అధ్యక్షుడు నడ్డా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీం విచారణ, కోర్టుపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ముస్లింల భూములను లాక్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భారతఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) ఎస్‌వై ఖురేషీ ఆరోపించారు. ఆ కుటిల ప్రయత్నాలను సుప్రీంకోర్టు అడ్డుకుంటుందన్న నమ్మకం తనకు ఉందంటూ ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దీనిపై నిశికాంత్‌ దూబే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖురేషీ సీఈసీగా ఉన్న సమయంలోనే ఝార్ఖండ్‌లోని సంతాల్‌ పరగణాలో బంగ్లాదేశీ చొరబాటుదారులకు ఓటర్‌ కార్డులు ఇచ్చారని.. ఆయన ఎన్నికల కమిషనర్‌ కాదు, ముస్లిం కమిషనర్‌ అని దూబే విమర్శించారు. చరిత్ర ప్రకారం క్రీస్తుశకం 712వ సంవత్సరంలో భారత్‌లోకి ఇస్లాం ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూమి అంతా హిందువులు, గిరిజనులు, జైనులు, బౌద్ధులదేనని పేర్కొన్నారు. కాగా, సుప్రీంకోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నిశికాంత్‌ దూబేపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి అనుమతించాలంటూ అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి న్యాయవాది అనాస్‌ తన్వీర్‌ ఆదివారం లేఖ రాశారు. సుప్రీంకోర్టుపై, చీఫ్‌ జస్టి్‌సపై నిశికాంత్‌ దూబే వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఈ అంశంపై బీజేపీ అధికారికంగా స్పందించింది.


దూబే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘‘న్యాయవ్యవస్థపై, సీజేఐపై పార్టీ ఎంపీలు నిశికాంత్‌ దూబే, దినేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆ ఇద్దరు నేతలతోపాటు పార్టీ శ్రేణులను ఆదేశించినట్టు తెలిపారు. తమకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని పేర్కొన్నారు. నిశికాంత్‌ దూబే, మరో ఎంపీ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ చీఫ్‌ నడ్డా తప్పించుకోవడంలో అర్థం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ మండిపడ్డారు. ఆ ఎంపీలు తరచూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని, వారికి పార్టీ షోకాజ్‌ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. నడ్డా ప్రకటన కేవలం నష్ట నివారణ ప్రయత్నమని విమర్శించారు.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్

Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:10 AM