ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2020 Delhi: '2020 ఢిల్లీ' చిత్రం వాయిదా వేయండి.. ఈసీని కోరిన కాంగ్రెస్

ABN, Publish Date - Jan 26 , 2025 | 09:43 PM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణానికి మతంరంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లు ఆధారంగా ''2020 ఢిల్లీ'' చిత్రం రూపొందింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు బాలీవుడ్ చిత్రం ''2020 ఢిల్లీ'' (2022 Delhi) విడుదలకానుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలను వాయిదా వేయాల్సిందిగా ఆదేశించాలని ఎన్నికలను కమిషన్‌ను కోరింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణానికి మతంరంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లు ఆధారంగా ''2020 ఢిల్లీ'' చిత్రం రూపొందింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2న సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగనుంది.

Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన


కాగా, సినిమా విడుదలను వాయిదా వేసేలా ఆదేశించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఈ చిత్రం ఒక నిర్దిష్ట కమ్యూనిటీపై దుష్ప్రచారం సాగిస్తూ ప్రజలను పోలరైజ్ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. బీజేపీకి తమ అభ్యర్థులపై కానీ, ఎన్నికల ప్రచారంపై కానీ నమ్మకం లేదని, అందుకే కమ్యూనల్ మోటివేటెట్ చిత్రాలపై ఆధారపడి సమాజాన్ని విడగొట్టడం, ఓటర్లను తప్పుదారి పట్టించడంపై ఆధారపడిందని విమర్శించారు. సినిమా అఫీషియల్ ప్రమోటర్స్‌‌ తరహాలో బీజేపీ నేతలు ఈ సినిమాకు విస్తృత ప్రచారం సాగిస్తున్నారని చెప్పారు. ఈ తరహా చిత్రాలను ఎన్నికలకు రెండ్రోజుల ముందు విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2019లోనూ ఇదే తరహా రహస్య ప్రణాళికను బీజేపీ అనుసరించిందని, మోదీ బయోపిక్ విడుదలకు ప్లాన్ చేసిందని అన్నారు. దీంతో తాము ఈసీని, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో ఎట్టకేలకు ఆ బయోపిక్ వాయిదాకు ఈసీ ఆదేశాలు జారీచేసిందని గుర్తుచేశారు.


అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ''2020 ఢిల్లీ'' వంటి చిత్రాల విడుదల వల్ల నిష్పాక్షిక ఎన్నికలకు ముప్పు వాటిల్లుతుందని సింఘ్వి అన్నారు. ఒక వర్గం ప్రజలకు వ్యతిరేకంగా ఓటర్లపై ప్రభావం చూపించే ప్రయత్నమంగా దీనిని పేర్కొన్నారు. సినిమా ప్రచారాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే సున్నితమైన అంశాలు, మతపరంగా రెచ్చగొట్టేందుకు అవకాశం ఉన్న చిత్రాలను ఎన్నికలకు ముందు విడుదల చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్‌..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 09:47 PM