Congress MP R Sudha: మార్నింగ్ వాక్‌లో మహిళా ఎంపీ.. మెడలో చైన్ కొట్టేసిన దొంగ..
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:22 AM
Congress MP R Sudha: ఓ వ్యక్తి స్కూటీపై వ్యతిరేక దిశలో వారి దగ్గరకు వచ్చాడు. వచ్చీ రాగానే సుధా మెడలోని చైన్‌ను పట్టి లాగాడు. ఊహించని ఈ పరిణామంతో ఎంపీ కిందపడబోయింది.
ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దొంగలు ద్విచక్ర వాహనాలపై వచ్చి ఆడవాళ్ల మెడలోని బంగారు చైన్లను దోచుకెళుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే.. ఓ దొంగ ఏకంగా మహిళా ఎంపీ మెడలోని చైన్ దోచుకెళ్లాడు. మరో మహిళా ఎంపీ పక్కన ఉండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం తమిళనాడు భవన్ ఏరియాలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు.
ఆమెతో పాటు మరో మహిళా ఎంపీ రజతి కూడా మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఎక్కడినుంచి వచ్చాడో తెలీదు కానీ, ఓ వ్యక్తి స్కూటీపై వ్యతిరేక దిశలో వారి దగ్గరకు వచ్చాడు. వచ్చీ రాగానే సుధా మెడలోని చైన్‌ను పట్టి లాగాడు. ఊహించని ఈ పరిణామంతో ఎంపీ కిందపడబోయారు. వెంటనే నిలదొక్కుకున్నారు. మెడలోని చైన్ తెగి, అతడి చేతిలోకి వెళ్లింది. అతడు వాయు వేగంతో స్కూటీపై అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనలో సుధా మెడకు గాయం అయింది.
ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగ ముఖానికి మాస్క్ వేసుకుని ఉండటంతో అతడు ఎలా ఉంటాడో సుధా చెప్పలేకపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగను గుర్తించి, పట్టుకునే పనిలో పడ్డాడు. కాగా, ఆ దొంగ హై సెక్యూరిటీ ఉండే చాణక్యపురి ఏరియాలోకి ఎలా వచ్చాడు. దొంగతనం చేసి ఎలా తప్పించుకోగలిగాడు అన్నది అంతుచిక్కని విషయంగా మారింది.
ఇవి కూడా చదవండి
జైలు నుంచి తప్పించుకుని.. ప్రియురాలు ఇంట్లో రిమాండ్ ఖైదీ
మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..
Updated Date - Aug 04 , 2025 | 11:45 AM