Prison Escapee: జైలు నుంచి తప్పించుకుని.. ప్రియురాలు ఇంట్లో రిమాండ్ ఖైదీ
ABN , Publish Date - Aug 04 , 2025 | 09:06 AM
Prison Escapee: ఆదివారం ఉదయం శ్రీనివాసన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. జైలు గోడ దూకి పారిపోయాడు. నేరుగా నాగలాపురంలోని తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.
తిరుపతి జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. జైలు నుంచి పరారైన ఓ రిమాండ్ ఖైదీ ప్రియురాలికి ఇంటికి చేరుకున్నాడు. ప్రియురాలి ఇంట్లో ఉంటే ఎవ్వరూ కనుక్కోరులే అనుకున్నాడు. అయితే, అతడి పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రియురాలితో ఉన్న అతడ్ని.. జైలు నుంచి పారిపోయిన 24 గంటల్లోనే పట్టుకున్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నాగలాపురానికి చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తి గత నెల 20వ తేదీన జరిగిన దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.
ప్రస్తుతం సత్యవేడు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఉంటున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాసన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. జైలు గోడ దూకి పారిపోయాడు. నేరుగా నాగలాపురంలోని తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. శ్రీనివాసన్ జైలులో కనిపించకపోవటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అతడి గురించి వెతకటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రియురాలి ఇంట్లో శ్రీనివాసన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అతడ్ని అరెస్ట్ చేశారు. మళ్లీ సబ్ జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి
వర్షాకాలంలో ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఏ వ్యాధి మీ దగ్గరకు రాదు.!
మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..