ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Arrested: మహిళపై నాలుగేళ్లుగా అత్యాచారం.. ఎంపీ అరెస్ట్.. ఎక్కడంటే

ABN, Publish Date - Jan 30 , 2025 | 04:53 PM

MP Arrested In Press Conference: ప్రెప్ కాన్ఫరెన్స్‌లో ఉన్న ఎంపీని పోలీసులు హుటాహుటిన అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఎంపీ అనుచరులు ఎంత ప్రయత్నించినా పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు.

MP Arrested

మహిళపై అత్యాచారం కేసులో ఓ ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో నుంచి ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని సీతాపూర్ నియోజకవర్గం ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 ఏళ్లుగా తనపై అత్యాచారం చేశారంటూ రాకేశ్‌ మీద ఒక మహిళ కేసు వేసింది. ఈ ఏడాది జనవరి 15వ తేదీన కూడా తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. పొలిటికల్ కెరీర్‌తో సంబంధం లేకుండా తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని తెలిపింది. ఈ మేరకు తనతో ఎంపీ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్, కాల్ డీటెయిల్స్‌తో పాటు పలు ఇతర సమాచారాన్ని పోలీసులకు అందజేసింది.


బెయిల్ తిరస్కరణ!

అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు ఎంపీ రాథోడ్. కానీ బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ను రిజెక్ట్ చేయడమే గాక లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసు గురించి రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హైకోర్టు నాకు 2 వారాల సమయం ఇచ్చింది. ముందస్తుగానే నేను పోలీసులకు లొంగిపోతున్నా. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అని రాకేశ్ రాథోడ్ చెప్పుకొచ్చారు. ఎంపీ రాకేశ్ రాథోడ్ మీద మరో కేసు కూడా నమోదైంది. తాము వేసిన కేసును ఉపసంహరించుకోవాలని ఎంపీ రాథోడ్‌తో పాటు ఆయన కుమారుడు వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలి భర్త పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు చేస్తూ ఎంపీపై మరో కేసు పెట్టారు. ఇకపోతే, గతంలో బీజేపీలో ఉన్న రాథోడ్.. యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందు బహుజన్ సమాజ్ పార్టీలో ఉండేవారు. తాజా కేసుతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు.


ఇవీ చదవండి:

కేజ్రీవాల్‌ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?

భక్తులకు అలర్ట్.. మహా కుంభమేళాలో 5 కీలక మార్పులు..

ఆ వ్యోమగాములను వెనక్కి తీసుకురండి.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 05:00 PM