Support for Pak: అందరూ పాక్ వెంటే ఉన్నారు.. ఎందుకిలా.. కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ ప్రశ్న
ABN, Publish Date - Jun 01 , 2025 | 01:32 PM
ప్రపంచదేశాల్లో పాక్‌కు మద్దతు ఎందుకు లభిస్తోందంటూ కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ ప్రశ్నించారు. బాధిత దేశంగా భారత్ మిగిలితే పాక్ మాత్రం వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ దుర్మార్గాన్ని ప్రపంచదేశాల ముందు ఎండగట్టడం, ఆపరేషన్ సిందూర్ ఆవశ్యకత తెలియజేసేందుకు భారత్ అఖిలపక్ష నేతలతో కూడిన దౌత్య బృందాలను వివిధ దేశాలకు పంపించింది. ఎంపీ శశిథరూర్ మొదలు అనేక మంది భారతీయ ఎంపీలు ఈ బృందాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్.. పాక్‌కు ప్రపంచదేశాల్లో మద్దతు ఎందుకు లభిస్తోందని ప్రశ్నించారు.
పాక్ వెంటే అంతా ఉన్నారని, భారత్‌కు మద్దతు కొరవడిందని షామా మొహమ్మద్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కూడా వాణిజ్య, అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటోందని అన్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలను కూడా ఆమె ప్రస్తావించారు. అమెరికా ఇప్పుడు పాక్, భారత్‌ను ఒకే గాటిన కడుతోందని అన్నారు. ‘కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారకుడినని ట్రంప్ వరుసగా 11 సార్లు చెప్పుకున్నారు. ఈ ఒప్పందం కోసం వాణిజ్యం నిలుపుదల హెచ్చరికలు కూడా చేశామన్నారు. ఇండియా, పాక్‌ను ఒకే గాటిన కట్టారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే భారత బాధిత దేశంగా ఉంది. 26/11 దాడుల తరువాత ప్రపంచం భారత్ వెంట నిలిచింది. ఇప్పుడు మనతో ఎవరున్నారు? పాక్‌కేమో వాణిజ్య ఒప్పందాలు దక్కుతున్నాయి. అంతా పాక్ వెంటే ఎందుకున్నారు.. భారత్ వెంట ఎందుకు లేరు?’ అని ఆమె అన్నారు.
ఇక పాక్‌తో ఘర్షణల్లో భారత్ యుద్ధ విమానాలు కోల్పోయిన విషయాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనీల్ చౌహాన్ అంగీకరించారు. అయితే, ఈ విషయంలో యుద్ధ విమానాలను ఎందుకు కోల్పోయామన్నదే ముఖ్య విషయమని స్పష్టం చేశారు. జరిగిన పొరపాట్లు ఏవో తెలుసుకోవడమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహాత్మక తప్పిదాలను సరిదిద్దుకుని మరో రెండు రోజులకు కొత్త వ్యూహాలను అమలు చేశామని చెప్పారు. మరింత సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించామని తెలిపారు.
ఇవీ చదవండి:
అమెరికా ఇప్పటివరకూ 1080 మంది భారతీయుల్ని డిపోర్టు చేసింది: విదేశాంగ శాఖ
ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 01 , 2025 | 07:38 PM