ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tamil Nadu: కేంద్రానికి కౌంటర్.. కొత్త విద్యా విధానం తెచ్చిన తమిళనాడు

ABN, Publish Date - Aug 08 , 2025 | 04:50 PM

కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఇవాళ సరికొత్త భాషా విధానాన్ని ఆవిష్కరించింది. హిందీ లేని, మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్, కృత్రిమ మేధ(ఏఐ), సైన్స్‌ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా..

Tamil Nadu Education Policy

ఇంటర్నెట్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం సరికొత్త భాషా విధానాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇవాళ (శుక్రవారం) తమ రాష్ట్ర ప్రజల కోసం సొంతంగా రాష్ట్ర విద్యా విధానాన్ని (ఎస్‌ఈపీ)ని ఆవిష్కరించారు. చెన్నైలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్, కృత్రిమ మేధ(ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), సైన్స్‌ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ఈ స్టేట్‌ ఎడ్యుకేషన్ పాలసీని తమిళనాడు రూపొందించింది. కేంద్రం విధానమైన త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేసే జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కొంతకాలంగా కేంద్రం, తమిళనాడుల మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తోందని స్టాలిన్‌ సర్కారు ఆరోపిస్తోంది.

మరోవైపు, నీట్‌ లాంటి ప్రవేశ పరీక్షలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఫలితంగా కొత్త విద్యా విధానంలో ప్రవేశపరీక్షకు బదులుగా మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇవ్వాలని నిర్ణయించారు. 11, 12వ తరగతుల మార్కుల ఆధారంగా ఆర్ట్స్‌, సైన్స్‌ వంటి కోర్సుల్లో యూజీ ప్రవేశాలు కల్పించేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు చేశారు. కాగా, ఈ కొత్త విద్యావిధానం రూపకల్పనకు రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని తమిళనాడు ప్రభుత్వం 2022లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్రిభాషా సూత్రాన్ని తిరస్కరించింది. 3, 5, 8 తరగతుల్లో పబ్లిక్ పరీక్షల ప్రతిపాదనను కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది.

విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని కూడా మురుగేశన్ కమిటీ సిఫారసు చేసింది. కాగా జాతీయ విద్యావిధానం అమలు చేయని కారణంగా సమగ్ర శిక్ష పథకం కింద కేంద్రం రూ. 2,152 కోట్లను నిలిపివేసిందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై స్పందించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ .. కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చినా, తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయదని తేల్చి చెప్పేశారు.

Also Read:

ఇంట్లో వరమహాలక్ష్మిని ఈ సాధారణ పద్ధతిలో పూజించండి

28 ఏళ్ల క్రితం కనిపించుకుండా పోయి.. మంచులో మమ్మీగా..

For More Latest News

Updated Date - Aug 08 , 2025 | 04:50 PM