Share News

Found After 28 Years: 28 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయి.. మంచులో మమ్మీగా..

ABN , Publish Date - Aug 08 , 2025 | 08:37 AM

Found After 28 Years: అనుకోని విధంగా 28 ఏళ్ల తర్వాత నజీరుద్దీన్ శవం దొరికింది. మంచులో కప్పబడి ఉన్న శవాన్ని గ్రామస్తులు గుర్తించారు. చనిపోయి 28 ఏళ్లు అవుతున్నా మంచు కారణంగా అతడి శవం పాడవలేదు.

Found After 28 Years: 28 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయి.. మంచులో మమ్మీగా..
Found After 28 Years

28 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మంచులో మమ్మీగా కనిపించాడు. చనిపోయి 28 ఏళ్లు అయినా మంచు కారణంగా ఆ శవం పాడవకుండా ఉంది. ఈ సంఘటన పాకిస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 1997లో పాకిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబం గొడవల కారణంగా ఊరు విడిచిపెట్టింది. కోహిస్తాన్ ప్రాంతంలోకి వచ్చేసింది. ఓ రోజు నజీరుద్దీన్ తన సోదరుడు కాతిరుద్దీన్‌తో కలిసి హిమనీనదం దగ్గర గుర్రంపై వెళుతూ ఉన్నాడు.


ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగింది. నజీరుద్దీన్ హిమనీనదంలో పడిపోయాడు. కాతిరుద్దీన్ అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు. నజీరుద్దీన్ కోసం ఎంత వెతికినా.. శవం కూడా దొరకలేదు. చాలా సార్లు కుటుంబసభ్యులు అతడి శవం కోసం హిమనీనదం దగ్గర వెతికారు. కానీ, లాభం లేకపోయింది. అయితే, అనుకోని విధంగా 28 ఏళ్ల తర్వాత నజీరుద్దీన్ శవం దొరికింది. మంచులో కప్పబడి ఉన్న శవాన్ని గ్రామస్తులు గుర్తించారు. చనిపోయి 28 ఏళ్లు అవుతున్నా మంచు కారణంగా అతడి శవం పాడవలేదు.


శవంతోపాటు దొరికిన ఐడెంటిటీ కార్డు ద్వారా అతడి అడ్రస్ గుర్తించారు. కుటుంబానికి సమాచారం ఇచ్చారు. నజీరుద్దీన్ చనిపోయాడన్న బాధ ఉన్నా.. 28 ఏళ్ల తర్వాత అతడి శవం దొరికినందుకు కుటుంబసభ్యులు సంతోషించారు. అధికారులు శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బుధవారం నజీరుద్దీన్ అంత్యక్రియలు జరిగాయి. ఇక, ఈ సంఘటనపై ప్రొఫెసర్ మహమ్మద్ బిలాల్ మాట్లాడుతూ.. ‘హిమనీనదంలో అతడు పడగానే విపరీతమైన చలి బాడీని గడ్డకట్టేలా చేసింది. మంచు కారణంగా బాడీ పాడవ్వలేదు. ఆక్సిజన్, తేమ లేకపోవటంతో శవం మమ్మీలాగా తయారైంది. ఇన్ని రోజులు పాడవకుండా ఉంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

భారత్‎పై అమెరికా ఆంక్షలు.. రష్యాతో కీలక భేటీ, టారీఫ్ తగ్గేనా

కెనడాలో భారతీయ స్టూడెంట్ తూటాకు బలి.. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు

Updated Date - Aug 08 , 2025 | 10:25 AM