Cloudburst in Kathua: జమ్మూకాశ్మీర్‌లో మరో విషాదం.. క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి..
ABN, Publish Date - Aug 17 , 2025 | 10:25 AM
Cloudburst In Kathua: క్లౌడ్ బరస్ట్ కారణంగా గ్రామంలో వరదలు రావటంతో నలుగురు చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
భూతల స్వర్గం జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌ల కారణంగా వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం మధ్యాహ్నం కిస్త్‌వార్‌లోని చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా 60 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా గల్లంతు అయ్యారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. కథువా జిల్లాలోని జంగ్లోట్‌లో శనివారం, ఆదివారం క్లౌడ్ బరస్ట్‌లు చోటుచేసుకున్నాయి.
క్లౌడ్ బరస్ట్ కారణంగా గ్రామంలో వరదలు రావటంతో నలుగురు చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘క్లౌడ్ బరస్ట్‌ల కారణంగా రైల్వే ట్రాక్, నేషనల్ హైవే, పోలీస్ స్టేషన్‌లు దెబ్బ తిన్నాయి. ప్రభుత్వ అధికారులు, మిలటరీ, పారా మిలటరీ రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.
అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. ఇక, వరుస క్లౌడ్ బరస్ట్‌ల నేపథ్యంలో వాతావరణ శాఖ కథువ జిల్లాకు హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు నదులు, కాలువలు, జలాశయాల దగ్గరకు వెళ్లకూడదని హెచ్చరించింది.
మాచైల్ మాత ఆలయానికి వెళ్లి..
చషోటి గ్రామం దగ్గరలో మాచైల్ మాత ఆలయం ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తూ ఉంటారు. చషోటి గ్రామంలో వాహనాలు వదిలి, కాలినడకన మాచైల్ మాత గుడికి వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గురువారం క్లౌడ్ బరస్ట్ జరిగింది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఇక, చషోటి గ్రామంలో చోటుచేసుకున్న క్లౌడ్ బరస్ట్ విషాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలకు ఫోన్ చేశారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనంత సాయం చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..
Updated Date - Aug 17 , 2025 | 10:25 AM