ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

China: అజిత్ దోవల్‌కు చైనా విదేశాంగ మంత్రి ఫోన్.. ఏమన్నారంటే

ABN, Publish Date - May 10 , 2025 | 11:37 PM

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మాట్లాడారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని, భవిష్యత్తులో కూడా ఉద్రిక్తతలకు తావు ఇవ్వకూడదని సూచించారు.

NSA Doval

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మాట్లాడారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని, భవిష్యత్తులో కూడా ఉద్రిక్తతలకు తావు ఇవ్వకూడదని సూచించారు. శనివారం రాత్రి అజిత్ దోవల్‌తో వాంగ్ యీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని ముందుకెళ్లాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు.


అంతకు ముందు వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాన్ దార్‌కు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్తాన్‌కు తమ సహాయం కొనసాగుతుందని, ఆ దేశానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ర్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్‌కు అండగా ఉంటామని వాంగ్ యీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వాంగ్ యీకి ప్రస్తుత పరిస్థితులను ఇషాన్ దార్ వివరించాని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - May 10 , 2025 | 11:37 PM