నివాసం ఉన్నచోటే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
ABN, Publish Date - Jul 02 , 2025 | 06:03 AM
ప్రజలు తాము ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు.
స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ, జూలై 1: ప్రజలు తాము ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు. తమకు సొంత ఇల్లు వేరే చోట ఉందని అక్కడ ఓటరుగా నమోదు చేసుకోకూడదన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితాలను ప్రత్యేకంగా ముమ్మర తనిఖీ చేస్తున్ననేపథ్యంలో ఆయన ఈమేరకు తెలిపారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రజలు తాము ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారో అక్కడ మాత్రమే ఓటుహక్కు పొందాలని తనను కలిసిన బూత్ స్థాయి అధికారులకు సీఈసీ వివరించారు. ఢిల్లీలో నివాసం ఉంటూ పట్నాలో ఇల్లు ఉందని అక్కడ ఓటుహక్కు పొందలేరని పేర్కొన్నారు. ప్రజలు తాము వలస వెళ్లిన చోట ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, కాని పాత నియోజకవర్గంలో ఓటరు కార్డును ఉంచుకోవడం శిక్షార్హమైన నేరమని ఈసీ అధికారులు తెలిపారు.
Updated Date - Jul 02 , 2025 | 06:03 AM