Health Insurence Claim: దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్
ABN, Publish Date - Apr 15 , 2025 | 12:56 PM
Health Insurence Claim: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్‌ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్‌ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆస్పత్రుల్లో మెడిక్లైయిమ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్‌ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్‌ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలతో బీమా క్లెయిమ్, అప్లికేషన్ ఫారమ్‌లను సులభంగా అర్థం అయ్యేలా రూపొందించనుంది. ప్రతి భారత పౌరుడికి 2047 నాటికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మెడిక్లెయిమ్ ప్రాసెసింగ్‌ను డిజిటల్‌గా ప్రమాణీకరించేందుకు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది.
2024 జులై నాటికి 34 బీమా సంస్థలు.. 300 ఆసుపత్రులు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్‌లో చేరాయి. మొత్తం 2 లక్షల ఆసుపత్రులను నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్‌లో భాగం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం అయితే ప్రజల్లో ఆరోగ్య బీమాపై నమ్మకం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు క్లెయిమ్‌లను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. దీనిపై నియంత్రణ అవసరం అని కేంద్రం భావిస్తోంది. ఇక, క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించేందుకు బీమా నియంత్రణ సంస్థ 2024లో కొత్త నియమాలు విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..
Somireddy: దమ్ముంటే కాకాణిని అప్పగించండి.. వైసీపీ నేతలకు సోమిరెడ్డి సవాల్
Updated Date - Apr 15 , 2025 | 01:08 PM