ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun Kharge: దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ చేసిందేమీ లేదు: ఖర్గే

ABN, Publish Date - Jan 26 , 2025 | 05:36 PM

రిపబ్లిక్ డే సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు.

బెంగళూరు: దేశ స్వాతంత్ర్యం కోసం కానీ, ఆర్థిక, సామాజిక వృద్ధి కోసం కానీ బీజేపీ చేసిందేమీ లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు. రిపబ్లిక్ డే సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, ఇండియాకు స్వాంతంత్ర్యం తెచ్చిందీ, దేశ ఐక్యత కోసం పోరాటం సాగించిందీ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.

Unified Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం


''ఇటీవల పలువురు నేతలు ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యాంగాన్ని అవమానించిన తీరు బాధాకరం. భారత రాజ్యాంగ నిర్మాతపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నేను పార్లమెంటులోనే ఉన్నాను. మీరు అంబేద్కర్ నామజపం చేస్తున్నారు..భగవంతుడి జపం చేస్తే స్వర్గంలో చోటైనా దక్కుతుందని అమిత్‌షా మాట్లాడారు. వీళ్లు దేశ స్వాంతత్రానికి గానీ, ఆర్థిక, సామాజిక వృద్ధి కోసం చేసిందేమీ లేదు'' అని ఖర్గే అన్నారు.


రిపబ్లిక్ డే ప్రాధాన్యతను ఖర్గే వివరిస్తూ, రాజ్యంగానికి దేశప్రజలంతా కట్టుబడి ఉంటాలని, కానీ కొన్ని కారణాల వల్ల రాజ్యాంగ విలువలన్నింటీనీ బీజేపీ సారథ్యంలోని కేంద్రం తుంగలోకి తొక్కిందని అన్నారు. పౌరుల హక్కులు, ముఖ్యంగా మహిళలకు రాజ్యాంగ ప్రసాదించిన స్వేచ్ఛను దిగజార్చారని విమర్శించారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మారుస్తామని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ 5వ స్థానం నుంచి కదలడం లేదని అన్నారు. యూపీఏ హయాంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని ఐదో స్థానానికి నెట్టేశారని విమర్శించారు. బడా వ్యాపారులు, శక్తివంతులకు గరిష్ట ప్రయోజనాలు చేకూరుస్తూ పేదలను పట్టించుకోవడం లేదని అన్నారు. "జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్" నినాదాన్ని కార్యకర్తలందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి:

Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్‌..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 05:36 PM