Kashmir VandeBharat: కశ్మీర్ వందేభారత్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్.. నెటిజన్ల ఆగ్రహం..
ABN, Publish Date - Jun 09 , 2025 | 08:18 PM
కశ్మీర్‌లో ప్రయాణిస్తున్న మొట్ట మొదటి వందే భారత్ రైలులో ఓ జంట తన కుమారుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించింది. వారణాసికి చెందిన నైహా జైస్వాల్ కుటుంబం కశ్మీర్ వందే భారత్ రైలులో ప్రయాణిస్తూ ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించింది.
కశ్మీర్‌లో ప్రయాణిస్తున్న వందే భారత్ (Kashmir VandeBharat) రైలులో ఓ జంట తన కుమారుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించింది. వారణాసికి చెందిన నైహా జైస్వాల్ కుటుంబం కశ్మీర్ వందే భారత్ రైలులో ప్రయాణిస్తూ ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను (Birthday Celebrations) ఘనంగా నిర్వహించింది. కదులుతున్న రైలులో కొవ్వొత్తి ఆర్పి, కేక్ కట్ చేసిన ఆ బాలుడు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న ప్రారంభించిన అంజిఖాడ్ వంతెనను రైలు దాటుతున్న సమయంలో రాకేష్, నేహా జైస్వాల్ తమ కుమారుడు మోక్ష్ చేత కేక్ కట్ చేయించారు.
ఆ వీడియోను ఆ బాలుడి తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలు పార్టీ హాల్ కాదని, లోపల కొవ్వొత్తులను వెలిగించడం సురక్షితం కాదని ఒకరు కామెంట్ చేశారు. రైళ్ల లోపల అగ్గిపుల్ల వెలిగించడం నిషేధం అని నేననుకుంటున్నాను అంటూ ఒకరు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు. తోటి ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు వీరిని శిక్షించాలి అని ఇంకొకరు పేర్కొన్నారు.
కాగా, శ్రీనగర్ నుంచి కాట్రాకు జూన్ 6వ తేదీన వందేభారత్ రైలు ప్రారంభించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే వాతావరణాన్ని తట్టుకునే రీతిలో ఆ రైలు బోగీలను తయారు చేశారు. మైనస్ ఉష్ణోగ్రతల్లోనూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండే రీతిలో కశ్మీర్ వందేభారత్ రైలును ఇంజినీర్లు సృష్టించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇంజినీర్లు కోల్డ్ క్లైమేట్ టెక్నాలజీతో ఈ కొత్త రైలును తయారు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి
మోదీ పాలనపై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 09 , 2025 | 08:18 PM