ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru Stampede: తొక్కిసలాటలో కుట్రకోణం

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:24 AM

ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా అధికారి జగదీశ్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ విచారణ కొనసాగుతోంది. సీఐడీ ఎస్పీ శుభన్విత నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది.

RCB Stampede

ఎన్‌ఐఏ దర్యాప్తు చేసే అవకాశం

కొనసాగుతున్న మెజిస్టీరియల్‌, సీఐడీ దర్యాప్తు

కేఎ్‌ససీఏ కార్యదర్శి, కోశాధికారి రాజీనామా

బెంగళూరు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా అధికారి జగదీశ్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ విచారణ కొనసాగుతోంది. సీఐడీ ఎస్పీ శుభన్విత నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. రిటైర్డు న్యాయమూర్తి మైఖేల్‌ డి కున్హా నేతృత్వంలో న్యాయ విచారణకు సైతం ఆదేశించారు. మరోవైపు ఎన్‌ఐఏ కూడా సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. తొక్కిసలాట అకస్మికంగా జరిగిందా..? ఇతరత్రా సంఘాలు, సంస్థల ప్రమేయం ఉందా? విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు ఎందుకు పాల్గొన్నారు? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో వచ్చేవారం నుంచి ఎన్‌ఐఏ విచారణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడానికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎ్‌ససీఏ) కార్యదర్శి ఎ.శంకర్‌, కోశాధికారి ఈఎస్‌ జయరాం తమ పదవులకు రాజీనామా చేశారు. స్టేడియం గేట్ల నిర్వహణ, జనసందోహం పర్యవేక్షణతో క్రికెట్‌ అసోసియేషన్‌కు సంబంధం లేదని పేర్కొంటూ కేఎ్‌ససీఏ అధ్యక్షుడు, కోశాధికారి, కార్యదర్శి శుక్రవారం హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంతలోనే శనివారం ఇద్దరూ రాజీనామా చేశారు.


మ్యాచ్‌ గెలవక ముందే ఎలా..?

ఆర్‌సీబీ, పంజాబ్‌ జట్ల మధ్య ఈ నెల 3న రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. అయితే విజయోత్సవాలకు అనుమతి కోరుతూ కబ్బన్‌ పార్క్‌ పోలీసులకు అదేరోజు సాయంత్రం 6 గంటలకే ఆర్‌సీబీ వినతిపత్రం ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. మ్యాచ్‌ గెలవడానికి ముందే విజయోత్సవాలకు అనుమతి కోరడంపై కేంద్రమంత్రి కుమారస్వామి అనుమానం వ్యక్తం చేశారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విధానసౌధ ఎదుట కార్యక్రమం నిర్వహిస్తామని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌(డీపీఆర్‌)కు కూడా వినతిపత్రం ఇచ్చారని తెలిపారు. తొక్కిసలాటలో 11మంది మృతి చెందడానికి సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌, హోంమంత్రి పరమేశ్వర్‌ కారణమని కబ్బన్‌పార్క్‌ పోలీ్‌సస్టేషన్‌లో బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆర్‌సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట ఘటనలో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీపై కేసు నమోదు చేయాలని నైజ హోరాటగారర సంఘం(నైతిక పోరాట సంఘం) ముఖ్యులు హెచ్‌ఎం వెంకటేశ్‌ కబ్బన్‌పార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుమోటోగా స్వీకరించిన ఎస్‌హెచ్‌ఆర్‌సీ

తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా కేసు నమోదు చేసింది. కమిషన్‌ చైర్మన్‌ శ్యామ్‌ భట్‌, సభ్యుడు సురేశ్‌ శుక్రవారం చిన్నస్వామి స్టేడియంను సందర్శించారు. పోలీస్‌ కమిషనర్‌, క్రికెట్‌ అసోసియేషన్‌, వైద్య ఆరోగ్యశాఖ కమిషర్‌కు నోటీసులు చేశారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 08:40 AM