Mohammad Yunus: బంగ్లా ఎన్నికలు ఫిబ్రవరిలో
ABN, Publish Date - Aug 06 , 2025 | 06:05 AM
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వంలోని
ఢాకా, ఆగస్టు 5: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వంలోని ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ తెలిపారు. ప్రధానిగా షేక్ హసీనా పదవీచ్యురాలై ఏడాది అయిన సందర్భంగా ఢాకాలో ఓ చానల్‌తో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. రంజాన్ మాసం 2026 ఫిబ్రవరి 17-18న మొదలవుతుందని, ఆ లోపే ఎన్నికలు పూర్తిచేయాలని ఎన్నికల సంఘాన్ని లేఖ ద్వారా కోరినట్లు ఆయన వెల్లడించారు.
Updated Date - Aug 06 , 2025 | 06:05 AM