ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌తో రూ.180 కోట్ల రక్షణ ఒప్పందం రద్దు

ABN, Publish Date - May 24 , 2025 | 05:28 AM

భారత్‌తో దౌత్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్న వేళ ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచే విధంగా బంగ్లాదేశ్‌ మరో నిర్ణయం తీసుకుంది.

  • బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయం

కోల్‌కతా, మే 23: భారత్‌తో దౌత్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్న వేళ ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచే విధంగా బంగ్లాదేశ్‌ మరో నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాకు చెందిన ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థతో రూ.180.25 కోట్ల విలువైన భారీ ఒప్పందాన్ని బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఈ మేరకు భారత రక్షణ శాఖ పరిధిలో పనిచేసే గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎ్‌సఈ) తాజాగా స్టాక్‌ ఎక్స్చేంజీకి సమాచారం ఇచ్చింది.


పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. సముద్రంలో ఓడలను లాక్కెళ్లడానికి, మునిగిపోయిన పడవలను వెలికి తీసే ఆపరేషన్లలో వినియోగించే అధునాతన టగ్‌ బోట్ల నిర్మాణం కోసం జీఆర్‌ఎ్‌సఈతో బంగ్లా ఒప్పందం చేసుకుంది.

Updated Date - May 24 , 2025 | 05:28 AM