పాక్‌పై ‘బలూచ్’ పిడుగు!
ABN, Publish Date - May 11 , 2025 | 04:17 AM
పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ వేర్పాటు వాదుల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కలాత్‌లోని ఓ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది.
కలాత్‌లో నగరం స్వాధీనం..బలూచ్‌లో 39 చోట్ల దాడులు
న్యూఢిల్లీ, మే 10: పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ వేర్పాటు వాదుల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కలాత్‌లోని ఓ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. అంతేకాదు.. బలూచిస్థాన్‌లోని 39 ప్రాంతాల్లో దాడులు చేసినట్టు తెలిపింది. అదేవిధంగా పలు కీలక రహదారులను, ప్రభుత్వ కార్యాలయాలను కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు బీఎల్‌ఏ వెల్లడించింది.
బలూచిస్థాన్‌లో ఖనిజ సంపదన కొల్లగొట్టేందుకు సహకరిస్తున్న సైనికులు, వారి కాన్వాయ్‌లపై కూడా దాడులు చేసినట్టు జీయాండ్ బలూచ్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు.. బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. క్వెట్టా, ఫైజాబాద్, హజర్గంజి ప్రాంతాల్లోని సైనిక పోస్టులపై గ్రెనేడ్లతో వేర్పాటు వాదులు దాడులకు పాల్పడ్డారు. అయితే.. బీఎల్‌ఏ దాడులు, రహదారుల దిగ్బంధనంపై పాకిస్థాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Updated Date - May 11 , 2025 | 04:17 AM