Baloch Attack: పాక్ ఆర్మీపై బలోచ్ వేర్పాటువాద దళాల దాడులు
ABN, Publish Date - May 09 , 2025 | 01:32 AM
భారత దాడి నేపథ్యంలో పాక్‌ను బలోచ్ ఆర్మీ కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కెట్టాలో జరిగిన ఈ దాడిలో సుమారు 14 మంది పాక్ సైనికులు కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై దాడి చేయబోయి చతికిలపడ్డ పాక్ ఆర్మీని బలోచ్ లిబరేషన్ ఆర్మీ కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత దాడులతో సతమతమవుతున్న పాక్.. బలోచ్ ఆర్మీ దాడులతో మరింత చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. కెట్టాలో జరిగిన దాడిలో 14 మంది పాక్ సైనికులు మృతి చెందారు. భారత్ దాడులను కూడా బలోచ్ రేడియో ప్రముఖంగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పాక్ ప్రధాని అధికారిక నివాసం సమీపంలో పేలుళ్లు సంభవించడంతో పాక్ సైన్యం ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.
పశ్చిమ, ఉత్తర సెక్టార్లపై పాక్ దాడిని భారత్ తిప్పికొట్టిన వెంటనే ప్రతిదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్.. పెషావర్, లాహోర్, కరాచీలను టార్గెట్ చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. నేవీ కరాచీపై దాడి ప్రారంభించినట్టు తెలిసింది.
ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ప్రతినిధి స్పందించారు. ఇరు దేశాలతో టచ్‌లో ఉన్నట్టు తెలిపారు. వివాదానికి సామరస్య పూర్వక పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. ఇక జమ్మూలో విధించిన బ్లాకౌట్‌ను అధికారులు తొలగించారు. అయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇక రేపు భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. భద్రతా ఏర్పాట్లపై అధికారులు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితిపై రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాధిపతులతో మరికాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు.
Updated Date - May 09 , 2025 | 01:42 AM