ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: డీజే విషయంలో గొడవ.. పోలీసులను చావగొట్టిన జనం

ABN, Publish Date - Jun 19 , 2025 | 07:05 PM

Viral Video: ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా అయింది. రెండు వర్గాలు దాడులు చేసుకుంటూ ఉన్నాయి. గొడవకు సంబంధించిన సమాచారం బర్ధాహ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ కుమార్ సింగ్ తన టీమ్‌తో అక్కడికి వెళ్లాడు.

Viral Video

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది వ్యక్తులు పోలీసులపై ఘాతుకానికి ఒడిగట్టారు. విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేశారు. గొడవ ఆపడానికి వెళ్లిన పోలీసులపై ఆ వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, అజామ్‌ఘర్‌లోని బర్రా గ్రామంలో జూన్ 6వ తేదీ రాత్రి ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డీజే కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.

ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా అయింది. రెండు వర్గాలు దాడులు చేసుకుంటూ ఉన్నాయి. గొడవకు సంబంధించిన సమాచారం బర్ధాహ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ కుమార్ సింగ్ తన టీమ్‌తో అక్కడికి వెళ్లాడు. పోలీసులంతా కలిసి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అయితే, అది కాస్తా బ్యాక్ ఫైర్ అయింది. రెండు గ్రూపులు కలిసి పోలీసుల మీదే దాడికి దిగాయి. కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ వారందరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 54 మందిపై కేసు నమోదు చేశారు. 17 మందిని అరెస్ట్ చేశారు. మరో 40 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఆ దుర్మార్గులు పోలీసుపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దెబ్బలు తాళలేక ఆ పోలీస్ అధికారి చావు కేకలు పెట్టాడు.

Updated Date - Jun 19 , 2025 | 08:33 PM