ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Army: సాటి సైనికుడిని కాపాడే క్రమంలో ఆర్మీ ఆఫీసర్ మృతి

ABN, Publish Date - May 24 , 2025 | 08:25 AM

నీటిలో మునిగిపోతున్న సాటి సైనికుడిని కాపాడే క్రమంలో ఓ ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు.

Indian Army hero

నీటిలో మునిగిపోతున్న సాటి సైనికుడిని కాపాడే ప్రయత్నంలో లెఫ్టెనెంట్ శశాంక్ తివారీ కన్నుమూశారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆయన దుర్మరణం చెందారు. సిక్కిమ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శశాంక్ తివారీ గతేడాది డిసెంబర్‌లోనే విధుల్లో చేరారు. సిక్కిమ్ స్కౌట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, సిక్కిమ్‌లోని ఓ ప్రాంతంలో ఆర్మీ ఓ స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. స్థావరానికి వెళ్లే మార్గం ఏర్పాటులో భాగంగా కొందరు సైనికులు పేట్రోలింగ్ నిర్వహించారు.


అయితే, నీటి ప్రవాహాన్ని దాటే క్రమంలో కాలు జారీన అగ్నీవీరుడు స్టీఫెన్ సుబ్బ నీటిలో పడిపోయారు. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోతున్న అతడిని కాపాడేందుకు లెఫ్టెనెంట్ తివారీ వెంటనే నీళ్లల్లోకి దూకి సుబ్బాను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే మరో సైనికుడు కూడా నీళ్లల్లోకి దిగి సుబ్బాను కాపాడారు. దురదృష్టవశాత్తూ తివారీ మాత్రం నీళ్లల్లో కొట్టుకుపోయి మరణించారు. ఘటనా స్థలానికి 800 మీటర్ల దూరంలో ఆయన మృత దేహం లభించింది.


ఘటనపై ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చిన్న వయసులోనే తివారీ అసమాన ధైర్యస్థైర్యాలు కనబరిచారని ప్రశంసించింది. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కీర్తించింది. అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది.

ఇవీ చదవండి:

ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ

ట్రంప్ తన పంతం నెగ్గించుకుంlటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 08:27 AM