Amit Shah: ఉగ్రవాదులు మళ్లీ తోకాడిస్తే విధ్వంసమే
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:35 AM
ఆదివారం తమిళనాడులోని మదురైలో జరిగిన బీజేపీ రాష్ట్ర నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో త్రివిధ దళాలు ఉగ్ర స్థావరాలను నాశనం చేశాయన్నారు.
చెన్నై, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదని, ఉగ్రవాదులు మళ్లీ తోకాడిస్తే సర్వనాశనమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హెచ్చరించారు. ఆదివారం తమిళనాడులోని మదురైలో జరిగిన బీజేపీ రాష్ట్ర నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో త్రివిధ దళాలు ఉగ్ర స్థావరాలను నాశనం చేశాయన్నారు. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను మన సైనికులు కూల్చివేశారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు తమిళనాడు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాలపైనా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాట వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. అంతకుముందు అమిత్‌షా మదురైలోని సుప్రసిద్ధ మీనాక్షి, సుందరేశ్వరర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 05:35 AM