Relationship Issues: ప్రియుడ్ని ఇంటికి పిలిచి స్ర్కూడ్రైవర్‌తో పొడిచి చంపి...
ABN, Publish Date - Aug 11 , 2025 | 03:15 AM
పచ్చటి సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. ఇటు భర్తో.. అటు భార్యో.. లేదా ప్రియుడో..
ఉత్తరప్రదేశ్‌లో భర్తతో కలిసి మహిళ దారుణం
లఖ్‌నవూ, ఆగస్టు 10: పచ్చటి సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. ఇటు భర్తో.. అటు భార్యో.. లేదా ప్రియుడో.. ఎవరో చివరికి నమ్మిన వారి చేతిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చిత్రహింసలు పెట్టి ఓ మహిళ చంపగా.. మరో ఘటనలో వివాహేతర సంబంధం విషయమై గొడవపడి భర్త మర్మాంగాన్ని భార్యే కోసేయడంతో చావుబతుకుల్లో అతడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్, అమేథిలో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. రయీస్, సితార భార్యాభర్తలు.. అయితే పక్కింట్లో ఉండే అనీశ్ (45)తో సితారకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవలే అనీశ్‌కు వివాహం నిశ్చయమవగా.. సితార అతడిని ఇంటికి పిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటికి వెళ్లగా భర్త రయీ్‌సతో కలిసి అతడిపై ఆమె దాడి చేసింది. స్ర్కూడ్రైవర్‌తో పొడవడంతో పాటు అతడిని చిత్రహింసలకు గురిచేశారు. ఈ క్రమంలోనే అనీశ్ కొన ఊపిరితో బయటికొచ్చి తన ఇంటి సమీపంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అనీశ్ తండ్రి మాట్లాడుతూ.. రయీస్ తమకు రూ.7 లక్షల అప్పు ఇవ్వాల్సి ఉందని.. అది అడిగేందుకే అతడి ఇంటికెళ్లగా అనీశ్‌ను తీవ్రంగా హింసించి కొట్టి చంపారన్నారు. ఫసన్‌గంజ్ కచ్‌నా గ్రామంలో నివసించే అన్సార్ అహ్మద్(38)కు ఇద్దరు భార్యలు.. కానీ పిల్లలు లేరు. అయితే అన్సార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని రెండో భార్య నజ్నీన్ బానోకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి భోజనంలో అతడికి మత్తు మందు పెట్టింది. అతడు మత్తులోకి జారుకోగానే కత్తితో మర్మాంగాన్ని కోసేసి పారిపోయింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
Updated Date - Aug 11 , 2025 | 03:15 AM