Amit Shah: రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ ఏమిటో వెల్లడించిన అమిత్‌షా
ABN, Publish Date - Jul 09 , 2025 | 09:53 PM
ప్రకృతి వ్యవసాయం సైన్స్ ఆధారిత టెక్నిక్ అని, చాలా ప్రయోజనాలు ఉంటాయని అమిత్‌షా చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్‌తో పెరిగే గోధుమలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రజాజీవనం నుంచి తప్పుకున్న తర్వాత ఏమి చేయాలనుకుంటున్నారో వివరించారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని చెప్పారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 'సహకార్ సంవాద్' కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ, రిటైర్మెంట్ తరువాత తన సమయాన్ని వేదాలు, ఉపనిషత్తులు చదవడం, ప్రకృతి వ్యవసాయం చేయడానికి కేటాయించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం సైన్స్ ఆధారిత టెక్నిక్ అని, చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్‌తో పెరిగే గోధుమలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. బీపీ, మధుమేహం, థెరాయిడ్, కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు అవకాశం ఉందని చెప్పారు. ప్రకృతి సేద్యంతో రోగాలు లేకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చని, మందులపై ఆధారపడటం తగ్గుతుందని వివరించారు. ప్రకృతి సేద్యం వల్ల పంట ఉత్పత్తి కూడా పెరుగుతుందని, తన ఫామ్‌ల్యాండ్‌లో పంట 1.5 రెట్లు పెరిగిన అనుభవం తనకు ఉందని చెప్పారు.
ఇవి కూాడా చదవండి..
భారత్‌పై చైనా వాటర్ బాంబు.. అరుణాచల్ సీఎం కీలక వ్యాఖ్యలు
సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 09:55 PM