Owaisi: పాకిస్థాన్.. బాధిత దేశం కాదు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశం
ABN, Publish Date - May 27 , 2025 | 04:52 AM
పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదు, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశమని ఒవైసీ అన్నారు. పాకిస్థాన్ ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులోకి మళ్లీ చేరేలా మద్దతివ్వాలని బహ్రెయిన్‌లోని దేశాలను భారత బృందం కోరింది.
న్యూఢిల్లీ, మే 26: పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదని, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశమని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ ఎంపీ బిజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ప్రస్తుతం బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. ఈ బృందంలో ఒవైసీ, గులాం నబీ ఆజాద్, నిశికాంత్ దూబే తదితరలు సభ్యులుగా ఉన్నారు. ఆదివారం ఒవైసీ బహ్రెయిన్‌లో ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ఉగ్రవాదంపై పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై బహ్రెయిన్‌కు పూర్తి సమాచారం ఇచ్చామన్నారు. ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్ దాడుల గురించి చెప్పామని, వీటన్నింటిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని తెలిపారు. పాకిస్థాన్‌ను తిరిగి ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చేలా మద్దతు ఇవ్వాలని బహ్రెయిన్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలను కోరినట్లు ఒవైసీ చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్‌లో ఉన్నంత మంది ఉగ్రవాదులు ప్రపంచం మొత్తమ్మీద కూఆ లేరని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ అన్నారు. ‘‘వివిధ పార్టీలకు చెందిన నేతలమంతా ఉగ్రవాదంపై పోరులో ఇప్పుడు ఒకటిగా, భారతీయులుగా బహ్రెయిన్ వచ్చాం’’ అని ఆయన తెలిపారు. బహ్రెయిన్‌లో అన్ని మతాల వాళ్లు ఉన్నారని, బహ్రెయిన్ తనకు మినీ ఇండియాలా అనిపిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 04:52 AM