ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే..

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:06 PM

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది.

Air India Plane crash

అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన (Plane crash ) సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. వెంటనే సహకార బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను ప్రారంభించాయి (Air India Plane crash).

ఈ క్రమంలో ఈ ప్రమాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. విమానం ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఉన్న ఓ వ్యక్తి ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. `మా ఆఫీస్ ఇక్కడి నుంచి 200 మీటర్ల దూరంలో ఉంది. నేను ఆఫీస్ నుంచి బయటకు అడుగు పెట్టగానే చాలా పెద్ద శబ్దం వినిపించింది. అకస్మాత్తుగా ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి, ఇక్కడ శిథిలాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. మంటలు చెలరేగుతున్నాయి. విపరీతంగా పొగ కమ్ముకుంటోంది. ఏమీ కనిపించలేదు. అప్పుడు విమానం రెక్కలు ఇక్కడ పడిపోయాయని, ఒక విమానం కూలిపోయిందని మాకు తెలిసింది.. ప్రాణనష్టం గురించి మాకు తెలియదు` అని ఆ వ్యక్తి జాతీయా మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.

కాగా, విమాన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలానికి బయల్దేరారు. ప్రధాని మోదీ కూడా రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..

నటి కల్పికకు ఊహించని షాక్..

For National News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 09:48 PM