Air India Plane crash: ఎయిరిండియా విమానం కూలే ముందు రాట్ తెరుచుకుందా.. దాని ప్రాధాన్యం ఏంటి?
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:28 PM
భారత ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద విషాదం జూన్ 12న అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే.
భారత ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద విషాదం జూన్ 12న అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్ (Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన (Plane crash ) సంగతి తెలిసిందే. విమానం కూలిపోక ముందు కాక్‌పిట్‌లో ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు (Air India Plane crash).
అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయే ముందు రాట్ తెరుచుకుందని ఏవియేషన్ నిపుణులు పేర్కొంటున్నారు. రాట్ అంటే విమానంలో ఉండే 'రామ్ ఎయిర్ టర్బైన్'. ఇది విమానంలోని వెనుక వైపున్న కుడి చక్రాలకు పక్కన మూసి ఉంటుంది. అత్యవసర సందర్భాలలో మాత్రమే ఈ రాట్‌ను వినియోగిస్తారు. ఇంజిన్‌లో ఏదైనా సమస్య వచ్చినపుడు దీనిని తెరుస్తారు. చిన్న ఫ్యాన్‌లా ఉండే ఈ రాట్ విమానం బ్యాలెన్స్ కోల్పోకుండా, కింద పడిపోకుండా నియంత్రిస్తుంది. ఇంజిన్‌లో సమస్య వచ్చినపుడు, విమానంలో విద్యుత్ సరఫరా లోపించినపుడు, హైడ్రాలిక్ సమస్యలు వచ్చినపుడు ఈ రాట్‌ను తెరుస్తారు.
ఎయిరిండియా విమానం కూలిపోక ముందు ఈ ర్యాట్ తెరిచి ఉండడం పలు వీడియోల్లో కనిపించింది. అత్యాధునిక బోయింగ్ విమానంలో విద్యుత్ సరఫరా సమస్య తలెత్తే అవకాశం లేదు. అయితే హైడ్రాలిక్ సమస్యలు తలెత్తి ఉండాలి. లేదా ఇంజిన్లలో లోపాలు తలెత్తి ఉండాలి. విమానంలో ఉన్న రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లే ఈ సమస్య వచ్చి ఉంటుందని చాలా మంది ఏవియేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు ఇంజిన్లు ఒకేసారి షట్ డౌన్ అయి ఉంటాయని, లేకపోతే అంత ప్రమాదం జరగదని అంటున్నారు.
ప్రమాదానికి ముందు ఏటీసీతో ఎయిరిండియా పైలెట్ చివరి సంభాషణ కూడా ఇంజిన్ వైఫల్యాన్నే సూచిస్తోంది. విమానం కూలిపోయే ముందు 'విమానంలో పవర్ లేదు. నో థ్రస్ట్. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..' అని పైలెట్ సుమత్ ఏటీసీకి చెప్పారు. ఈ సంభాషణ ఏటీసీలో రికార్డు అయింది. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్‌లు లేదా ప్రొపెల్లర్‌ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ విమాన ప్రమాదంలో ఇంజిన్ లేదా ప్రొపెల్లర్‌ల వైఫల్యం కీలక పాత్ర పోషించినట్టు అర్థమవుతోంది.
Also Read:
101 మృతదేహాలు బంధువులకు అప్పగింత.. కొనసాగుతోన్న ప్రక్రియ
ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 100 మంది భారతీయ విద్యార్థులు
For More National News
Updated Date - Jun 17 , 2025 | 06:47 PM