ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ahmedabad Plane Crash: విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్..!

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:17 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో లభ్యమైన బ్లాక్ బాక్స్ దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిని విదేశాలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Black Box in Ahmedabad Plane Crash

న్యూఢిల్లీ, జూన్ 19: అహ్మదాబాద్ నుంచి లండన్‌కు టేకాఫ్ అయిన విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలి దగ్ధమైంది. ఈ ఘటనలో 270 మందికిపైగా మరణించారు. అయితే ఈ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్‌ బాక్స్‌‌ను విదేశాలకు పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనిని అమెరికాకు పంపి.. అందులోని డేటాను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రం సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నాయి.

వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుకు ఈ బ్లాక్ బాక్స్‌ను పంపాలని భావిస్తున్నాయి. బ్లాక్ బాక్స్‌లో రెండు విభాగాలు ఉంటాయి. అవి కాక్‌పిట్ వాయిస్ రికార్డు, ప్లయిట్ డేటా రికార్డు. వీటి ద్వారా విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఏం జరిగిందనే విషయం వీటిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్‌లో నిక్షిప్తమైన డేటా వెలికి తీస్తే.. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే బీజే కాలేజీ హాస్టల్‌పై కుప్పుకూలి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్క వ్యక్తి మినహా 229 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో పాటూ బీజే హాస్టల్‌లోని 29 మంది మెడికోలు మరణించిన సంగతి తెలిసిందే.

ప్రమాదం జరిగిన కొద్ది రోజులకు విమానం బ్లాక్ బాక్స్‌ను బీజే కాలేజీ హాస్టల్ వద్ద కనుగొన్నారు. దీనిని విమానయాన శాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని... అందులోని డేటాను వెలికి తీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రమాద ఘటనలో ఈ బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిని యూఎస్‌కు పంపి.. డేటాను రివకరీ చేసేందుకు కేంద్రం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ సైతం పూర్తికానుంది.

ఈ వార్తలు కూడ చదవండి..

విద్యార్థులు విన్నపం.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం

ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం


For National News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 06:03 PM