ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ahmadabad: మంటల్లోనూ చెక్కు చెదరని ‘భగవద్గీత‘

ABN, Publish Date - Jun 14 , 2025 | 04:56 AM

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు.

అహ్మదాబాద్‌, జూన్‌ 13: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. విమానంలోని 1.25 లక్షల లీటర్ల ఇంధనం కారణంగా మంటలు వ్యాపించి అందులోని భాగాలే కరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా ఆ విమాన శకలాల్లో చెక్కుచెదరని రీతిలో ఉన్న పవిత్ర గ్రంథం భగవద్గీత సహాయ సిబ్బందికి లభించింది. అట్ట మీద కొన్ని గీతలు పడడం తప్పిస్తే పుస్తకం అంతా భద్రంగానే ఉంది.

ఇస్కాన్‌ వ్యవస్థాపకుడు స్వామి ప్రభుపాద చిత్రం సహా ఏ ఫొటో కూడా దెబ్బతినలేదు. ఒక్కచోట ఓ పేజీ మాసినట్టు కనిపించినా గ్రంథం మొత్తం బాగానే ఉంది. బహుశా ఆ సమయంలో ఏ ప్రయాణికుడైనా ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. మంటలు వ్యాపించినా ఆ పవిత్ర గ్రంథం ఏ మాత్రం దెబ్బతినకుండా కనిపించిందని సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 04:56 AM