ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Turkish Firm Celebi: తుర్కియే సంస్థ ‘సెలెబి’కి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన అదానీ..

ABN, Publish Date - May 16 , 2025 | 12:20 PM

Turkish Firm Celebi: భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అల్లాడిపోతున్న సెలెబి సంస్థకు మరో గట్టి దెబ్బ తగిలింది. అదాని సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదాని ఏయిర్‌పోర్టు హోల్డింగ్స్.. సెలెబితో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.

Turkish Firm Celebi

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం సమయంలో తుర్కియే దేశం పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. పాకిస్తాన్ తమ సోదర దేశం అని.. వారికి మద్దతుగా ఉంటామని తుర్కియే దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్పష్టం చేశాడు. పాక్ ప్రధాని షెహబాజ్ సరీఫ్ తమ "విలువైన సోదరుడు" అంటూ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశాడు. తుర్కియే భారత్‌తో వ్యాపారాలు చేస్తూ.. పాకిస్తాన్‌కు అండగా నిలవటంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురైంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతా పరమైన సేవలను అందిస్తున్న తుర్కియేకు చెందిన సెలెబి ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ఇండియాపై ప్రభుత్వం వేటు వేసింది.


ఆ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ గురువారం ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అల్లాడిపోతున్న సెలెబి సంస్థకు మరో గట్టి దెబ్బ తగిలింది. అదాని సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదాని ఏయిర్‌పోర్టు హోల్డింగ్స్.. సెలెబితో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు ఒప్పందాలు రద్దు చేసుకుంటూ గురువారం నిర్ణయం తీసుకుంది.


సెలెబి సంస్థ అదాని ఏయిర్‌పోర్టు హోల్డింగ్స్‌తో కలిసి.. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టు, అహ్మదాబాద్‌లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టు‌లకు సంబంధించిన భద్రతా పరమైన సేవలను నిర్వహిస్తోంది. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అదాని కంపెనీ.. సెలెబితో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది. వెంటనే అన్ని బాధ్యతల్ని తమకు అప్పగించాలని అదాని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

Dipika Kakar: పాపం నటికి ఎంత కష్టం వచ్చింది.. కాలేయంలో టెన్నిస్ బాల్ సైజు ట్యూమర్

Viral Video: ఇలాంటి స్వాగతాన్ని మీరెప్పుడూ చూసుండరు..

Updated Date - May 16 , 2025 | 12:20 PM