Viral Video: ఇలాంటి స్వాగతాన్ని మీరెప్పుడూ చూసుండరు..
ABN , Publish Date - May 16 , 2025 | 09:12 AM
US President Donald Trump: ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెల్ల దుస్తులు ధరించిన అమ్మాయిలు తమ పొడవాటి జుట్టును అటు, ఇటు తిప్పుతూ ట్రంప్‌కు స్వాగతం పలికారు. ట్రంప్‌కు వింతగా స్వాగతం పలకటంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తూ ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో ఉన్నారు. గురువారం సాయంత్రం ఆయన యూఏఈ చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ స్పెషల్ అసిస్టెంట్ మార్గో మార్టిన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. తెల్ల దుస్తులు ధరించిన అమ్మాయిలు తమ పొడవాటి జుట్టును అటు, ఇటు తిప్పుతూ ట్రంప్‌కు స్వాగతం పలికిన దృశ్యాలు ఉన్నాయి.
ట్రంప్‌కు వింతగా స్వాగతం పలకటంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు. యునెస్కో ప్రకారం.. తెల్ల దుస్తులు ధరించిన ఆ అమ్మాయిలు పొడవాటి జుట్టుతో స్వాగతం పలకడాన్ని ‘అల్ అయ్యల’ అంటారు. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్కృతిలో ఓ భాగం. ముఖ్య అతిధులకు ఇలా స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇక, ట్రంప్ యూఏఈ పర్యటనలో భాగంగా అమెరికా, యూఏఈల మధ్య ఏఐకి సంబంధించి పలు ఒప్పందాలు జరగనున్నాయి. యూఏఈ.. అమెరికానుంచి ప్రతీ ఏటా 5 లక్షల అధునాతనమైన ఏఐ చిప్స్‌ను దిగుమతి చేసుకోనుంది.
ట్రంప్‌పై దారుణమైన కామెంట్లు
అమెరికాలోని పెంటగాన్‌కు చెందిన మాజీ అధికారి మైఖేల్ రూబిన్.. డొనాల్డ్ ట్రంప్‌పై దారుణమైన కామెంట్లు చేశారు. ట్రంప్ ప్రతీ దానికి తానే కారణమని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడని అన్నారు. ట్రంప్‌ను అడిగితే.. ఒంటి చేత్తో వరల్డ్ కప్ సాధించానంటాడని, ఇంటర్‌నెట్‌ను కనిపెట్టింది కూడా తానేనంటాడని.. క్యాన్సర్‌ను నయం చేసింది కూడా తానేనంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతీయులు ట్రంప్ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. జుట్టుతో వెరైటీ స్వాగతం
ఇవి కూడా చదవండి
WhatsApp Tricks: అద్దిరిపోయే వాట్సాప్ ట్రిక్.. మెసేజ్ ఎవరిదో ఫోన్ చూడకుండానే చెప్పొచ్చు..
India Pak ceasefire: కాల్పుల విరమణ మే 18 వరకే.. పాకిస్తాన్ మంత్రి సంచలన కామెంట్లు..