Share News

India Pak ceasefire: కాల్పుల విరమణ మే 18 వరకే.. పాకిస్తాన్ మంత్రి సంచలన కామెంట్లు..

ABN , Publish Date - May 16 , 2025 | 07:52 AM

India Pak Ceasefire: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఐషాక్ దార్ సంచలన కామెంట్లు చేశారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ఐషాక్ దార్ కామెంట్లు చర్చకు దారి తీశాయి.

India Pak ceasefire: కాల్పుల విరమణ మే 18 వరకే.. పాకిస్తాన్ మంత్రి సంచలన కామెంట్లు..
India Pak Ceasefire

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ముగిసి ఐదు రోజులు అవుతోంది. మే 10వ తేదీన రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. యుద్ధాన్ని విరమించాయి. మే 14వ తేదీన రెండు దేశాలకు చెందిన డీజీఎంఓలు కాల్పుల విరమణ గురించి చర్చించుకున్నారు. అయితే.. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఐషాక్ దార్ సంచలన కామెంట్లు చేశారు. ఐషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ‘ పాకిస్తాన్ మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా..


ఇండియా లెఫ్టెనెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ల మధ్య గత బుధవారం హాట్‌లైన్‌లో చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 18వరకు మాత్రమే వర్తిస్తుంది. అదే రోజు రెండు దేశాల మధ్య మరో సారి చర్చలు జరుగుతాయి’ అని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఐషాక్ దార్ అంతర్జాతీయ మీడియా సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ.. ‘ సింధూ జలాల వివాదాన్ని పరిష్కరించకుంటే అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకరకంగా అది యుద్ధానికి కాలు దువ్వటమే అవుతుంది’ అని అన్నారు.


ఇండియాతో చర్చలకు సిద్ధం..

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇండియాతో చర్చలకు తాము సిద్ధమేనని అన్నారు. రెండు దేశాలు కూర్చుని మాట్లాడుకుని శాంతి ఒప్పందానికి వద్దామని అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా ఏయిర్‌బేస్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ శాంతి ఒప్పందం కోసం ఇండియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నాము. కాశ్మీర్ సమస్య గురించి కూడా మాట్లాడదాం’ అని అన్నారు. భారత్, పాక్ మధ్య యుద్ధం ముగిసిన తర్వాత ప్రధాని షెహబాజ్ వరుసగా ఏయిర్‌బేస్‌ల దగ్గరకు వెళుతున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

ముగిసిన యుద్ధం, మిగిలిన ప్రశ్నలు

Updated Date - May 16 , 2025 | 10:32 AM