WhatsApp Tricks: అద్దిరిపోయే వాట్సాప్ ట్రిక్.. మెసేజ్ ఎవరిదో ఫోన్ చూడకుండానే చెప్పొచ్చు..
ABN , Publish Date - May 16 , 2025 | 08:34 AM
WhatsApp Tricks: ఈ చిన్న ట్రిక్‌తో ఇకపై ఎప్పుడైనా వాట్సాప్‌కు మెసేజ్ వస్తే.. ఫోన్ చూడకుండానే ఎవరో తెలుసుకోండి. మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న వారికి.. ఒక్కోరికి ఒక్కో రింగ్‌టోన్ సెట్ చేసుకోవచ్చు. రింగ్‌టోన్‌ను బట్టి మెసేజ్ చేసింది ఎవరో ఇట్టే కనిపెట్టవచ్చు.
ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు వాట్సాప్ ఓ నిత్య అవసరం అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. రోజులో ఒకసారైనా వాట్సాప్ ఓపెన్ చేయని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. తమ యూజర్లకు మంచి అనుభవాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చింది. తెస్తోంది కూడా. వాట్సాప్‌లో ఇదే వరకే ఉన్న ఓ అద్భుతమైన ట్రిక్ గురించి ఇప్పుడు చెబుతాను.
మీరు ఏదైనా పనిలో ఉన్నారు. ఫోన్‌కు కొంచెం దూరంలో ఉన్నారు. అప్పుడు వాట్సాప్‌కు మెసేజ్ వచ్చిందనుకోండి. ఎవరా అని ఫోన్ దగ్గరకు వెళ్లి చూడాల్సి వస్తుంది. అలా కాకుండా మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న వారికి.. ఒక్కోరికి ఒక్కో రింగ్‌టోన్ సెట్ చేసుకోవచ్చు. రింగ్‌టోన్‌ను బట్టి మెసేజ్ చేసింది ఎవరో ఇట్టే కనిపెట్టవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇలా సెట్ చేసుకోండి..
మొదట వాట్సాప్ ఓపెన్ చేసి చాట్స్ ట్యాబ్‌లోకి వెళ్లండి. అక్కడ మీరు ఏ కాంటాక్ట్‌కు అయితే రింగ్‌టోన్ సెట్ చేయాలని అనుకుంటున్నారో.. ఆ కాంటాక్ట్ ఓపెన్ చేయండి. తర్వాత వారి ప్రొఫైల్‌లోకి వెళ్లండి. కింద నోటిఫికేషన్స్ దగ్గరకు వెళ్లండి. నోటిఫికేషన్స్ ఆప్షన్‌ను ఓపెన్ చేయండి. అందులో రింగ్‌టోన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.. మీకు రెండు రకాలుగా రింగ్‌టోన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఫోన్‌లో ఉన్న రింగ్‌టోన్లను వాడుకోవచ్చు. లేదా మనమే ఏదైనా పాటను మన రింగ్‌టోన్‌గా సెట్ చేసుకోవచ్చు.
ఐఫోన్‌లో ఇలా..
మొదటగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి. చాట్స్ ట్యాబ్ ఓపెన్ చేసి.. మీరు ఎవరి కాంటాక్ట్‌కు అయితే రింగ్‌టోన్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారో వారి కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వాల్ పేపర్ అండ్ సౌండ్స్‌ను క్లిక్ చేయండి. అక్కడ అలర్ట్ టోన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన రింగ్ టోన్ సెట్ చేసుకోండి. ఇకపై ఎప్పుడైనా వాట్సాప్‌కు మెసేజ్ వస్తే.. ఫోన్ చూడకుండానే ఎవరో తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి
India Pak ceasefire: కాల్పుల విరమణ మే 18 వరకే.. పాకిస్తాన్ మంత్రి సంచలన కామెంట్లు..
Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..