ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB Notice to Kejriwal: కేజ్రీవాల్‌కు 5 ప్రశ్నలతో ఏసీబీ నోటీసు

ABN, Publish Date - Feb 07 , 2025 | 09:33 PM

ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు అదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే, నోటీసు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందురోజు ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేజీ ప్రయత్నిస్తోందంటూ చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు యాంటీ కరప్షెన్ ఏజెన్సీ (ACB) శుక్రవారంనాడు నోటీసులు ఇచ్చింది. ఆయన చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని అందులో పేర్కొంది. తీవ్రమైన ఆరోపణలు చేసినందున వాటిపై ఏసీబీ తక్షణ దర్యాప్తు జరిపి ఏసీబీ నిజనిర్ధారణ చేయాల్సి ఉందని పేర్కొంది. శుక్రవారం వీలైన సమయంలో సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని కోరింది. కేజ్రీవాల్‌ చేసిన పోస్ట్‌పై నోటీసులో 5 ప్రశ్నలు సంధించింది.

Election Commission: రాతపూర్వకంగా స్పందిస్తాం.. రాహుల్ ఆరోపణలపై ఈసీ


5 ప్రశ్నలివే

-ట్వీట్ పోస్ట్ చేసింది మీరేనా? ఇంకెవరైనా పోస్ట్ చేశారా?

-16 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపారంటూ ట్వీట్‌లో పేర్కొంటున్న విషయంతో మీరు ఏకీభవిస్తారా?

-ఫోన్ కాల్ అందుకున్న ఆ 16 మంది అభ్యర్థులు ఎవరు?

-వారికి వచ్చిన నంబర్లు, సంబంధిత సమాచారాన్ని అందించండి.

-మీరు, మీ పార్టీ సభ్యులు మీడియా/సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు కానీ, ఇతర సమాచారం కానీ ఉంటే అందించండి.


ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు అదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే, నోటీసు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు


ఇవి కూడా చదవండి..

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 09:33 PM