ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ahmedabad: 2029 ప్రపంచ పోలీస్‌ క్రీడలు భారత్‌లో

ABN, Publish Date - Jun 29 , 2025 | 04:17 AM

మరో నాలుగేళ్ల తర్వాత 2029లో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక ప్రపంచ పోలీస్‌, అగ్నిమాపక క్రీడలకు భారత్‌ తొలిసారి ఎంపికైంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ క్రీడలు నిర్వహించనున్నారు. 1985 నుంచి రెండేళ్లకోసారి నిర్వహించే...

న్యూఢిల్లీ, జూన్‌ 28: మరో నాలుగేళ్ల తర్వాత 2029లో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక ప్రపంచ పోలీస్‌, అగ్నిమాపక క్రీడలకు భారత్‌ తొలిసారి ఎంపికైంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ క్రీడలు నిర్వహించనున్నారు. 1985 నుంచి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ పోటీల్లో భారత్‌ 2007లో తొలిసారి పాల్గొంది. నాటి నుంచి ఇప్పటివరకు భారత్‌ 1400కు పైగా పతకాలు గెలుచుకుంది. ఇప్పటివరకు ఈ క్రీడలను అమెరికా 8 సార్లు, కెనడా 5, యూరప్‌ 4, యూకే 2, చైనా ఒకసారి నిర్వహించాయి. సర్వీసులో ఉన్న వారితో పాటు రిటైరైన పోలీస్‌, అగ్నిమాపక దళ సిబ్బంది, విపత్తు సేవల సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొనేందుకు అర్హులు. ఈసారి 50 అంశాల్లో క్రీడలు నిర్వహిస్తారు. 2029 ప్రపంచ పోలీస్‌ క్రీడలకు ఎంపిక కావడం భారత్‌కు గర్వకారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు.

Updated Date - Jun 29 , 2025 | 04:19 AM