Railways Festival Offer: పండుగ వేళ రైల్వే బంపర్ ఆఫర్
ABN, Publish Date - Aug 10 , 2025 | 03:04 AM
పండుగ సందర్భంగా భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ఫర్
రానూపోనూ టికెట్ బుక్ చేస్తే తిరుగు ప్రయాణంపై 20% తగ్గింపు
అక్టోబరు 13-26 జర్నీ, 17 నవంబరు-
డిసెంబరు 1 రిటర్న్ జర్నీలకు వర్తింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 9: పండుగ సందర్భంగా భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ఫర్ ఫెస్టివల్ రష్’ పేరుతో శనివారం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. రాను పోను ప్రయాణానికి రైలు టికెట్లు బుక్ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం బేస్ ఫేర్‌లో 20ు రిబేట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇబ్బందులు లేని ప్రయాణానికి, ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడాన్ని, రైళ్లలో ప్రయాణించడాన్ని ప్రోత్సహించడానికి, రద్దీని క్రమబద్దీకరించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ప్రత్యేక రైళ్లు సహా అన్ని రైళ్లలో, అన్ని తరగతులకూ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద టికెట్లు ఆగస్టు 14 నుంచి బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు 13 నుంచి 26 మధ్య ప్రయాణం చేయవచ్చని, తిరుగు ప్రయాణం నవంబరు 17 నుంచి డిసెంబరు 1వ తేదీలోపు చేయాలని పేర్కొంది. పథకాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని షరతులు వర్తిస్థాయని పేర్కొంది. ‘రెండు వైపుల కన్ఫర్మ్ టికెట్లు ఉండాలి. రెండు వైపుల గమ్యస్థానాలు ఒకటే అయు ఉండాలి. ‘ప్లెక్సీ ఫేర్’ ఉన్న రైళ్లు... రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ పథకం వర్తించదు. తిరుగు ప్రయాణానికి ఏఆర్‌పీ (అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ పీరియడ్) వర్తించదు. అలాగే కూపన్లు, ఓచర్లు, పాసులు పనిచేయవు. ఈ పథకం కింద బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు వాపసు చేయరు’ అని రైల్వే తెలిపింది.
Updated Date - Aug 10 , 2025 | 03:04 AM