Fighting Over Tandoori Roti: మరీ ఇంత దారుణమా.. తందూరీ రోటీ కోసం కొట్టికుని చచ్చారు
ABN, Publish Date - May 05 , 2025 | 07:20 AM
Fighting Over Tandoori Roti: పెళ్లిలో తందూరీ రోటీ కోసం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా ఓ వర్గం వ్యక్తులు ఆషిష్, రవి అనే ఇద్దరు యువకులపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరూ చనిపోయారు.
మనుషుల్లో మంచి చెడుల విచక్షణ నశిస్తోంది. మరీ ముఖ్యంగా ఓపిక లేకుండా లేకుండా అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. ఇన్‌స్టంట్ యుగంలో అన్నీ వెంటనే కావాలనే ఆలోచన మనుషుల్ని చావుకు దగ్గర చేస్తోంది. తాజాగా, తందూరీ రోటీ కోసం ఇద్దరు యువకుల ప్రాణాలు బలయ్యాయి. పెళ్లికి హాజరైన వీరు తందూరీ రోటీల కోసం పెళ్లి కొడుకు బావ, అతడి మిత్రులతో గొడవపెట్టుకున్నారు. దీంతో వారు ఆ ఇద్దర్నీ కొట్టి చంపేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారాయ్ హ్రిదయ్ షా గ్రామానికి చెందిన ఆషిష్, రవి, సురాజ్, సత్యంలు ఆదివారం ఓ పెళ్ళికి వెళ్లారు. రాత్రి 11.45 గంటల సమయంలో డిన్నర్ చేయడానికి కౌంటర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ తందూరీ రోటీలు తినడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈనేపథ్యంలో పెళ్లి కొడుకు బావ రోహిత్‌తో వాగ్వివాదం మొదలైంది. మాటల యుద్దం కాస్తా కొద్దిసేపటి తర్వాత కొట్టుకునే వరకు వెళ్లింది. గొడవ మరీ పెద్దది కాకముందే ఆ నలుగురు బైకులపై అక్కడినుంచి బయలు దేరారు.
అయితే, రోహిత్‌తో పాటు అతడి స్నేహితులు దీపక్, సందీప్, శివ, మాలిక్‌లతో పాటు మరికొంతమంది కర్రలు, రాడ్లతో బైకులపై వారిని ఫాలో అయ్యారు. ఒంటి గంట సమయంలో పాతక్ కా పుర్వ దగ్గర వారి బైకులను అడ్డగించారు. సురాజ్, సత్యంలు అక్కడినుంచి పారిపోగా.. ఆషిష్, రవిలు దొరికిపోయారు. రోహిత్ గ్యాంగు కర్రలు, రాడ్లతో వారిపై దాడి చేసింది. విచక్షణా రహితంగా కొట్టింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరూ చనిపోయారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..
Updated Date - May 05 , 2025 | 07:20 AM