Share News

Wife Catches Husband: భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ప్రియురాలిని పరిగెత్తించి కొట్టింది..

ABN , Publish Date - May 05 , 2025 | 06:41 AM

Wife Catches Husband: ఓ రోజు భర్త ఫోన్‌లో మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళపై కోపం వచ్చింది. వెంటనే ఆమె ఉండే చోటుకు వెళ్లింది. ఆమెపై దాడి చేయటం మొదలెట్టింది.

Wife Catches Husband: భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ప్రియురాలిని పరిగెత్తించి కొట్టింది..
Wife Catches Husband

భార్యా భర్తల బంధాలు బాగా దెబ్బతింటున్నాయి. భాగస్వామి ఎంతో ప్రేమగా ఉంటున్నా కూడా కొంతమంది పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ రోజు భర్త తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండగా.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహంతో భర్త ప్రియురాలి దగ్గరకు వెళ్లింది. ఆమెను పరిగెత్తించి మరీ కొట్టింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్, ముజఫర్ నగర్‌లోని అలీఫుర్ ఖర్ద్ అనే గ్రామానికి చెందిన ఓ జంటకు కొన్నేళ్ళ క్రితం పెళ్లయింది. గత కొన్ని నెలలనుంచి భర్త ప్రవర్తనలో తేడా రావటం భార్య గుర్తించింది. అతడు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. భార్యకు అనుమానం వచ్చింది. వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని భావించింది. ఓ రోజు భర్త ఫోన్‌లో మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళపై కోపం వచ్చింది. వెంటనే ఆమె ఉండే చోటుకు వెళ్లింది. ఆమెపై దాడి చేయటం మొదలెట్టింది.


లవర్ భార్యనుంచి తప్పించుకోవడానికి ఆ మహిళ పరుగులు తీసింది. అయినా కూడా ఆ భార్య వదల్లేదు. వెంటాడి మరీ దారుణంగా కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. అయితే, ఈ దాడికి సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది. అయినప్పటికి ముజఫర్ నగర్ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంఘటనపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియోపై యూపీ పోలీస్ తమ ట్విటర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఈ ఆదేశాలు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

APSRTC Bribe Row: డబ్బులిస్తేనే ప్రమోషన్లా

3,300కుపైగా కంపెనీల పేర్లు తొలగింపు!

Updated Date - May 05 , 2025 | 06:41 AM