3,300కుపైగా కంపెనీల పేర్లు తొలగింపు!
ABN , Publish Date - May 05 , 2025 | 05:39 AM
కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీల సంఖ్య తగ్గనుంది. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేనందున తమ పేర్లు తొలగించాలని 3,300కు పైగా కంపెనీలు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వ శాఖకు...
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీల సంఖ్య తగ్గనుంది. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేనందున తమ పేర్లు తొలగించాలని 3,300కు పైగా కంపెనీలు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వ శాఖకు దరఖాస్తు చేశాయి. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని వివిధ రాష్ట్రాల రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) పత్రికల్లో నోటిఫికేషన్లు జారీ చేశాయి. కంపెనీల చట్టంలోని సెక్షన్ 248 (2) ప్రకారం ఏదైనా కంపెనీ నమోదైన ఏడాదిలోగా వ్యాపారం ప్రారంభించక పోయినా లేదా ఒక ఆర్థిక సంవత్సరం తర్వాత వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయకపోయినా ఆ కంపెనీ తమ పేరును రికార్డుల నుంచి తొలగించమని కోరవచ్చు. అయితే అందుకు వాటాదారుల్లో 75 శాతం మంది ఆమోదం కావాలి.
మహారాష్ట్ర నుంచే ఎక్కువ: తమ పేర్లను రికార్డుల నుంచి తొలగించమని మహారాష్ట్ర నుంచే ఎక్కువ కంపెనీలు కోరాయి. ఆ రాష్ట్రం నుంచి దీనికి సంబంధించి 700కు పైగా కంపెనీల నుంచి విజ్ఞప్తులు అందాయి. ఢిల్లీ (500+) కర్ణాటక (350+) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా రెండేసి వందల కంపెనీలు ఇందుకోసం విజ్ఞప్తి చేశాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో 28,52,449 కంపెనీలు నమోదై ఉండగా అందులో 18,50,932 కంపెనీలు మాత్రమే చురుగ్గా పని చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News