యూపీలో జైలు నుంచి 104 ఏళ్ల ఖైదీ విడుదల
ABN, Publish Date - May 24 , 2025 | 05:38 AM
హత్య, హత్యాయత్నం కేసుల్లో 43 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన 104 ఏళ్ల ఖైదీ నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యాడు. గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన అప్పీలు చేయగా, నిర్దోషిగా ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలిచ్చింది.
43 ఏళ్ల జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
కౌశాంబీ (యూపీ), మే 23: హత్య, హత్యాయత్నం కేసుల్లో 43 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన 104 ఏళ్ల ఖైదీ నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యాడు. గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన అప్పీలు చేయగా, నిర్దోషిగా ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలిచ్చింది. కౌశాంబీ జిల్లా గౌరాయే గ్రామానికి చెందిన లఖన్ 1921లో జన్మించినట్టు జైలు రికార్డుల్లో ఉంది. 1977 ఆగస్టు 16న రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరిని హత్య చేయడంతో పాటు, మరికొందరిపై దాడి చేసినట్టు కేసు నమోదయింది.
విచారణ జరిపిన ప్రయాగ్‌రాజ్ జిల్లా, సెషన్స్ కోర్టు లఖన్‌తో పాటు మరో ముగ్గురికి 1982లోయావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుపై వారు అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే ముగ్గురు నిందితులు మరణించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనను ఈ నెల 2న నిర్దోషిగా ప్రకటించింది.
Updated Date - May 24 , 2025 | 05:38 AM